తెలంగాణ

telangana

ETV Bharat / international

'భారత్​పై ఫిర్యాదు చేసినందుకే నాపై ట్రంప్ వేటు' - COVID-19 latest news

కరోనా మహమ్మారి, హైడ్రాక్సీక్లోరోక్విన్ వినియోగంపై పలు మార్లు చేసిన హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఓ శాస్త్రవేత్త ఆరోపించారు. మలేరియా మందు వాడకాన్ని వ్యతిరేకించినందుకే తనను, తన సహచరులను విధుల నుంచి తప్పించారంటూ ఫిర్యాదు చేశారు.

Trump
'భారత్​పై ఫిర్యాదు చేసినందుకే నాపై ట్రంప్ వేటు'

By

Published : May 6, 2020, 1:04 PM IST

Updated : May 6, 2020, 2:12 PM IST

కరోనా వైరస్ సహా భారత్, పాకిస్థాన్ నుంచి వచ్చే హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం నాణ్యతపై పలు మార్లు చేసిన హెచ్చరికలను అమెరికా ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పట్టించుకోలేదని ఇటీవల విధుల నుంచి ఉద్వాసనకు గురైన ఓ శాస్త్రవేత్త ఆరోపించారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అధికారుల కారణంగానే దేశంలో వైరస్ విజృంభించిందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రజావేగుల రక్షణకు ఉద్దేశించిన అమెరికా ప్రత్యేక కౌన్సెల్ కార్యాలయంలో మంగళవారం ఈ మేరకు ఫిర్యాదు చేశారు డా. రిక్ బ్రైట్. ఆరోగ్య, మానవ సేవల విభాగం(హెచ్​హెచ్​ఎస్​) ఉన్నతాధికారులు, ఔషధాల నాణ్యతను చూసే అధికారులు.. తాను పలు మార్లు చేసిన హెచ్చరికలను విస్మరించారని అందులో పేర్కొన్నారు.

విధుల నుంచి తొలగించకముందు.. హెచ్​హెచ్​ఎస్​లోని ‘జీవవైద్యశాస్త్ర ఆధునిక పరిశోధన, అభివృద్ధి సంస్థ’కు నేతృత్వం వహించారు బ్రైట్.

పాకిస్థాన్, భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఔషధాలపై ఇప్పటికీ ఆందోళన చెందుతున్నా. ఆ డ్రగ్, వాటిని ఉత్పత్తి చేసే పరిశ్రమలను ఎఫ్​డీఏ తనిఖీ చేయలేదు. తనిఖీ చేయని పరిశ్రమల నుంచి వచ్చే ఔషధాలు కలుషితంగా, సరైన మోతాదులో ఉండకపోవచ్చు. వాటిని వినియోగిస్తే తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. ప్రమాదకరమని తెలిసినా డా.కాడ్లెక్ సహా ఇతర అధికారులు పట్టించుకోలేదు. ఈ డ్రగ్​ను ఎక్కువ వినియోగించేందుకు ప్రయత్నించారు.

- డా. రిక్ బ్రైట్, అమెరికా శాస్త్రవేత్త

అదొక్కటే మార్గం...

ప్రమాదకరమైన మలేరియా డ్రగ్ హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకాన్ని తగ్గించేందుకు తన బృందంతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఎంత ప్రయత్నించినా.. ఏ ఒక్కరు సాయం చేయలేదని ఆరోపించారు డా.బ్రైట్. ఈ ఔషధంతో సమస్యలు, కలిగే ప్రమాదాన్ని అర్థం చేసుకున్న పాత్రికేయులతోనే తన ఆవేదనను పంచుకోవటం ఒక్కటే మార్గమమని తుది నిర్ణయానికి వచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.

వ్యతిరేకించినందుకే..

అతి తక్కువ శాస్త్రీయ ఆధారాలతో, తక్కువ సమయంలోనే హెడ్రాక్సీక్లోరోక్విన్​ను దేశవ్యాప్తంగా వినియోగించేందుకు హెచ్​హెచ్​ఎస్​ కార్యదర్శి ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు బ్రైట్. ఈ ఔషధం వినియోగాన్ని వ్యతిరేకించినందుకే తనను, తన సహచరులను విధుల నుంచి తొలగించారని పేర్కొన్నారు.

Last Updated : May 6, 2020, 2:12 PM IST

ABOUT THE AUTHOR

...view details