తెలంగాణ

telangana

ETV Bharat / international

'పారిస్​' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ

'పారిస్ పర్యావరణ ఒప్పందం 2015' నుంచి  వైదొలుగుతున్నట్లు ప్రకటించిన అమెరికా.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి అధికారిక లేఖ రాసింది. 200 దేశాలు సంతకం చేసిన ఈ ఒప్పందం అగ్రరాజ్యానికి నష్టం చేకూరుస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే.. అమెరికా నిర్ణయంపై ఫ్రాన్స్​ విచారం వ్యక్తం చేసింది.

'పారిస్​' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ

By

Published : Nov 5, 2019, 11:01 AM IST

Updated : Nov 5, 2019, 2:11 PM IST

'పారిస్​' నుంచి వైదొలుగుతూ ఐరాసకు అమెరికా లేఖ
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి వైదొలగుతున్నట్లు అమెరికా అధికారికంగా తెలియజేసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితికి లేఖ పంపినట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే.. అంతర్జాతీయ వాతావరణ చర్చల్లో వాస్తవిక, ఆచరణాత్మక పాత్రను పోషిస్తామని వెల్లడించింది.

నష్టం కలుగుతుందని..

'పారిస్​ పర్యావరణ ఒప్పందం 2015'.. పారిశ్రామికీకరణతో వేడెక్కుతోన్న భూగోళాన్ని రక్షించేందుకు.. ఏర్పాటు చేసుకున్న ఒప్పందం. ఈ ఒడంబడికపై దాదాపు 200 దేశాలు సంతకాలు చేశాయి. ఈ ప్రపంచ ఒప్పందం కుదరడానికి అమెరికా మాజీ అధ్యక్షుడు బారక్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారు.

2016 నవంబర్​ 4 నుంచి ఇది అమలులోకి వచ్చింది. అయితే డొనాల్డ్​ ట్రంప్​ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక... ఈ ఒప్పందం భారత్, చైనాలకు అనుకూలంగా ఉందని, అమెరికా ప్రయోజనాలకు తీవ్ర నష్టం కలుగిస్తోందని ఆరోపిస్తూ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఒప్పందం ప్రకారం సంతకం చేసిన ఏ దేశమూ.. మూడేళ్ల వరకు వైదొలగడానికి ఆస్కారం లేదు. అయితే గడువు ముగియడం వల్ల ఇప్పుడు వైదొలగే ప్రక్రియ ప్రారంభించింది అగ్రరాజ్యం. ఐరాసకు లేఖ రాసింది.

ఫ్రాన్స్ విచారం...​

పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలుగుతుందని ముందే ఊహించినట్లు తెలిపిన ఫ్రాన్స్... ఈ నిర్ణయం పట్ల విచారం వ్యక్తం చేసింది.

చైనా పర్యటనలో ఉన్న ఫ్రాన్స్​ అధ్యక్షుడు మేక్రాన్ "అమెరికా వైదొలుగుతున్నందుకు మేం చింతిస్తున్నాము. అగ్రరాజ్య నిర్ణయం వాతావరణం, జీవవైవిధ్యాలపై ఫ్రాంకో-చైనీస్ భాగస్వామ్యాన్ని మరింత తప్పనిసరి చేస్తోంది." అని తెలిపారు.

అధ్యక్షుడు మారితే మళ్లీ చేరొచ్చు...

పారిస్​ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగే.. ఈ ప్రక్రియ ముగియడానికి ఏడాది సమయం పట్టొచ్చు. ఈ లోపు 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలు అయిపోతాయి. అయితే ఎన్నికల్లో ట్రంప్​ కాకుండా మరెవరైనా అధ్యక్షుడిగా ఎన్నికైతే.. వారి నిర్ణయం మేరకు 30 రోజుల్లో తిరిగి ఒప్పందంలో చేరవచ్చు. ఒప్పందం నుంచి వైదొలగాలనే ట్రంప్​ నిర్ణయంపై ప్రతిపక్ష డెమొక్రాట్లు, ప్రజాసంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి.

ఇదీ చూడండి:'పారిస్'​ నుంచి వైదొలిగేందుకు అమెరికా ప్రక్రియ​ షురూ!

Last Updated : Nov 5, 2019, 2:11 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details