తెలంగాణ

telangana

ETV Bharat / international

భారత్​పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ గుస్సా

అమెరికా ఉత్పత్తులపై సుంకాలను భారతదేశం చాలా కాలంగా పెంచుతూనే ఉందని ఆరోపించారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​​. ఈ విషయాన్ని ఇకపై సహించేది లేదని ట్వీట్​ చేశారు.

By

Published : Jul 9, 2019, 9:12 PM IST

Updated : Jul 10, 2019, 12:24 AM IST

భారత్​పై అమెరికా అధ్యక్షుడి గుస్స

అమెరికా వస్తువులపై భారత్​ సుంకాలు విధించడాన్ని ఇకపై సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్. చాలా కాలంగా తమ దేశ ఉత్పత్తులపై భారత్​ సుంకాలు పెంచుతూనే ఉందని ట్వీట్ చేశారు.

జపాన్​లో జీ-20 సదస్సు వేదికగా ట్రంప్​- మోదీ కలిసిన కొద్ది రోజులకే అగ్రరాజ్య అధ్యక్షుడు ఈ వ్యాఖ్యాలు చేశారు. ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలపై చర్చించేందుకు ఇరు దేశాల ఆర్థిక మంత్రులతో సమావేశం కావాలని జీ-20 సదస్సులో ఇరు దేశాధినేతలు నిర్ణయించారు. సుంకాల పెంపు విషయంపై మోదీతో చర్చిస్తానని భేటీకి ముందే ట్వీట్ చేశారు ట్రంప్​.

భారత్​- అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంలో వాణిజ్యం కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా సంస్థలకు భారత మార్కెట్​లో అవకాశాలు, ఆ దేశ వస్తువులపై ఇటీవలి కాలంలో సుంకాల పెంపు వంటి అంశాలు వాణిజ్య ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి.

'భారత్​ సుంకాల రారాజు...'

అమెరికా వస్తువులపై సుంకాలు విధిస్తున్నందుకు భారత్​ను 'సుంకాల రారాజు' అని గతంలోనే విమర్శించారు ట్రంప్​.

బాదం, వాల్​నట్​ సహా అమెరికా నుంచి దిగుమతి చేసుకునే 28 వస్తువులపై ఇటీవలే సుంకాలను పెంచింది భారత్​. ఉక్కు, అల్యూమినియం లాంటి భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన అధిక సుంకాలకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకుంది.

ఇదీ చూడండి: భారతీయుల కలల బిల్లుకు ఆమోదం నేడే!

Last Updated : Jul 10, 2019, 12:24 AM IST

ABOUT THE AUTHOR

...view details