తెలంగాణ

telangana

ETV Bharat / international

ఫైజర్ టీకా ప్రకటన వెనుక కుట్ర: ట్రంప్

అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్​ టీకాపై ప్రకటన చేసిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు. ఎఫ్​డీఏ, ఫైజర్​ కలిసి ఎన్నికల్లో తనకు విజయం దక్కకూడదని ఇలా చేశారని ఆరోపించారు. మీడియా పోల్​ సర్వేలపైనా విరుచుకుపడ్డారు.

US-TRUMP-VIRUS-VACCINE
ట్రంప్

By

Published : Nov 10, 2020, 9:35 AM IST

అమెరికా ఆహార, ఔషధ విభాగం (ఎఫ్​డీఏ)తోపాటు ఫార్మా దిగ్గజం ఫైజర్​పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు చేశారు. ఎన్నికల ముందు కరోనా టీకా​ ప్రకటనపై ఆలస్యం చేసి ఎన్నికల్లో ఓటమికి కారణమయ్యారని ఆరోపించారు.

మానవులపై చేసిన పరీక్షల్లో తమ టీకా 90శాతం మేర కచ్చితమైన ప్రభావం చూపించిందని ఫైజర్ ప్రకటన చేసిన నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ట్రంప్ ట్వీట్లు

"ఎన్నికల్లో నాకు 'టీకా విజయం' దక్కకూడదని ఎఫ్​డీఏ, డెమొక్రాట్లు భావించారు. నేను చెబుతూనే వస్తున్న.. ఎన్నికల తర్వాత టీకా ప్రకటన చేస్తారని.. ఇప్పుడు 5 రోజుల తర్వాత చేశారు. కానీ, ఈ పని ముందే చేసి ఉండాల్సింది.

బైడెన్​ అధ్యక్షుడిగా ఉంటే ఇంకో నాలుగేళ్లు అయినా టీకా వచ్చి ఉండేది కాదు. ఇంత తొందరగా ఎఫ్​డీఏ ఆమోదం వచ్చి ఉండేది కాదు. అధికార యంత్రాంగం లక్షలాది ప్రాణాలను బలి తీసుకునేది."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

మీడియాపై..

ఎన్నికల్లో మీడియా జోక్యానికి ముగింపు పలకాలని ట్రంప్ పిలుపునిచ్చారు. ప్రధాన మీడియా సంస్థలు తనపై ఇచ్చిన పోల్ సర్వేలు సరికావని ఆరోపించారు. ఇవి ఓటర్లను ప్రభావితం చేయటం సహా ప్రచారాన్ని, విరాళాల సమీకరణను తగ్గించాయని మండిపడ్డారు.

ఇదీ చూడండి:ఫైజర్​ 'కరోనా వ్యాక్సిన్'​ 90శాతం ప్రభావవంతం!

ABOUT THE AUTHOR

...view details