తెలంగాణ

telangana

ETV Bharat / international

వాయు కాలుష్యంపై భారత్​ నిర్లక్ష్యం: ట్రంప్​ - అమెరికా అధ్యక్షుడు

పారిస్​ పర్యావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగటాన్ని సమర్థించుకున్నారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. భారత్​, చైనా, రష్యాలు.. వాయుకాలుష్యం తగ్గించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. నాస్​విల్లేలో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల తుది సంవాదంలో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు ట్రంప్​.

donald trump
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్

By

Published : Oct 23, 2020, 10:10 AM IST

నాస్​విల్లేలో జరిగిన అధ్యక్ష అభ్యర్థుల తుది సంవాదంలో పర్యావరణ మార్పులపై కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. భారత్​, చైనా, రష్యా దేశాలు వాయు కాలుష్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని మరోమారు ఆరోపించారు. 200 దేశాలు సంతకం చేసిన పారిస్​ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం వైదొలగటాన్ని ఆయన సమర్థించుకున్నారు​.

" భారత్​, రష్యా, చైనాలను చూస్తే.. ఏ మేర వాయు కాలుష్యం ఉందో తెలుస్తుంది. వేలాది డాలర్లు ఖర్చు చేయాల్సి రావటం, అమెరికాకు సరైన న్యాయం జరగదనే కారణాలతో పారిస్​ ఒప్పందం నుంచి బయటకు వచ్చాం. "

-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు

భారత్​, చైనా వంటి దేశాలు వాతావరణ మార్పులపై సరైన చర్యలు తీసుకోవటం లేదని తరచుగా ఆరోపణలు చేస్తున్నారు ట్రంప్​. ఆయా దేశాల్లో గాలి కలుషితమై.. ఊపిరితీసుకునేందుకు కూడా పనికిరాకుండా ఉందని పేర్కొన్నారు.

పారిస్​ పర్యావరణ ఒప్పందం నుంచి 2017లో బయటకు వచ్చారు ట్రంప్​. భూతాపం పెరుగుదలను 2 డిగ్రీల లోపు ఉంచాలన్న అంతర్జాతీయ ఒప్పందంతో అమెరికా ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని ఆ సందర్భంగా పేర్కొన్నారు.

ఇవీ చూడండి: ట్రంప్​Xబైడెన్​ : అధ్యక్షుడి వైఫల్యం వల్లే కేసులు పెరిగాయా?

ట్రంప్​ X బైడెన్​: కరోనా సన్నద్ధతపై వాడీవేడి చర్చ

ABOUT THE AUTHOR

...view details