తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆఫ్గాన్​లో 19 ఏళ్ల సేవలు సరిపోతాయ్: ట్రంప్​

విరామంలేని యుద్ధాలతో సతమతవుతున్న అమెరికా దళాలను స్వదేశానికి రప్పిస్తానని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పునరుద్ఘాటించారు. అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైనిక దళాలు చేసిన 19 ఏళ్ల సేవలు సరిపోతాయని ట్రంప్‌ స్పష్టం చేశారు. వాళ్లంతా తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నారని తెలిపారు.

TRUMP
ట్రంప్​

By

Published : Oct 23, 2020, 5:07 AM IST

అఫ్గానిస్థాన్‌లో అమెరికా సైనిక దళాలు చేసిన 19 ఏళ్ల సేవలు సరిపోతాయని అధ్యక్షుడు ట్రంప్‌ పునరుద్ఘాటించారు. వాళ్లంతా తిరిగి స్వదేశానికి వచ్చేస్తున్నారని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే ట్రంప్‌ పలుమార్లు చెప్పారు. 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనూ ఇదే అంశాన్ని ఉటంకించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా నార్త్‌ కరోలినాలోని గ్యాస్టోనియాలో ఏర్పాటు చేసిన ర్యాలీలో ట్రంప్‌ మాట్లాడారు.

"ఇతర దేశాల్లో యుద్ధం కోసం అమెరికా జవాన్లు రక్తం చిందించడం నేను ఇప్పటి వరకు చూడలేదు. మీరు కూడా వినుండరు. అందుకే వాళ్లందరూ స్వదేశానికి వచ్చేస్తున్నారు. దీనిని ఎవరూ వ్యతిరేకించరని అనుకుంటున్నాను. దాదాపు 19 ఏళ్లపాటు అఫ్గాన్‌లో చేసిన సేవలు చాలు. ప్రపంచంలోనే బలమైన సైనిక బలం అమెరికా సొంతం. అలాంటి మన జవాన్లు అక్కడ పోలీసుల్లా పని చేస్తున్నారు. ఇక దీనికి స్వస్తి చెబుదాం."

- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు

విరామంలేని యుద్ధాలతో అక్కడ సతమతవుతున్న అమెరికా దళాలను స్వదేశానికి రప్పిస్తానని ట్రంప్‌ అప్పట్లోనే అన్నారు. ఇదే అంశంపై గత నెలలో స్పందిస్తూ అనతి కాలంలోనే అఫ్గాన్‌లో ఉన్న అమెరికా దళాల సంఖ్యను 4,000కు తగ్గించామన్నారు.

ఇదీ చూడండి:ఓవైపు శాంతిమంత్రం - మరోవైపు సమర తంత్రం

ABOUT THE AUTHOR

...view details