తెలంగాణ

telangana

ETV Bharat / international

చైనాతో త్వరలోనే గొప్ప వాణిజ్య ఒప్పందం: ట్రంప్​

అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం ఓ కొలిక్కి రానుంది. ఇరుదేశాల మధ్య త్వరలోనే ఒప్పందం కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. 2020 ఎన్నికలకు ముందు లేదా ఎన్నికల వెనువెంటనే ఒప్పందం ఉండొచ్చని తెలిపారు.

చైనాతో త్వరలోనే వాణిజ్య ఒప్పందం: ట్రంప్​

By

Published : Sep 18, 2019, 9:15 AM IST

Updated : Oct 1, 2019, 12:51 AM IST

త్వరలోనే చైనాతో వాణిజ్య ఒప్పందం కుదురుతుందని తెలిపారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​. 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు లేదా ఎన్నికలు పూర్తయిన వెంటనే ఒప్పందం జరిగే అవకాశముందని పేర్కొన్నారు. ఎన్నికలకు తర్వాత జరిగితే.. ఇప్పటివరకు ఇదే గొప్ప ఒప్పందం అవుతుందన్నారు.

" త్వరలోనే చైనాతో ఒప్పందం జరిగే అవకాశం ఉంది. అది ఎన్నికలకు ముందు కానీ, ఎన్నికలు పూర్తయిన తర్వాత గానీ ఉండొచ్చు. నేను ఎన్నికల్లో గెలువబోతున్నానని చైనా భావిస్తోంది."
-డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు.

2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలుస్తానని చైనా ఆందోళన చెందుతోందన్నారు ట్రంప్​. ఒక వేళ ఎన్నికల్లో తాను తిరిగి గెలిస్తే ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దుర్భలంగా మారుతాయని ఇప్పటికే హెచ్చరించినట్లు ఉద్ఘాటించారు. వారు మరొకరు గెలవడాన్ని చూడాలనుకుంటున్నారని ట్రంప్​ తెలిపారు. జో, ఎలిజబెత్​ పోకాహెంటాస్​ వారెన్లు విజయం సాధించేందుకు చైనా ఇష్టపడుతుందని ఎద్దేవా చేశారు.

2020 వరకు వాణిజ్య లోటును 200 బిలియన్​ డాలర్లకు చైనా తగ్గించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని మరోమారు హెచ్చరించారు ట్రంప్​. గతేడాది 636 బిలియన్​ డాలర్ల మొత్తం వాణిజ్యంలో సుమారు 375 బిలియన్​ డాలర్ల వాణిజ్య లోటు ఉందని అమెరికా పేర్కొంది.

2018లో మొదలు..

పరస్పరం దిగుమతి సుంకాలు పెంచటం వల్ల 2018లో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మొదలైంది. తొలుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ 250 బిలియన్​ డాలర్లు విలువ చేసే చైనా ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు పెంచారు. దానికి ప్రతీకారంగా 110 బిలియన్​ డాలర్ల అమెరికా వస్తువులపై సుంకాలు విధించింది చైనా.

ఇరు దేశాలు వాణిజ్య ఒప్పందం చేసుకునేందుకు 2018 నవంబర్​ నుంచి చర్చలు కొనసాగిస్తున్నాయి. కానీ చర్చల్లో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లభించలేదు.

Last Updated : Oct 1, 2019, 12:51 AM IST

ABOUT THE AUTHOR

...view details