తెలంగాణ

telangana

ETV Bharat / international

కొలంబియా, పెరులో 8 లక్షలకు కరోనా కేసులు - covid deaths in brazil

ప్రపంచదేశాల్లో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. కేసుల సంఖ్య 3 కోట్ల 30 లక్షలు దాటింది. మరణాలు ఏకంగా 10 లక్షలకు చేరువయ్యాయి. న్యూయార్క్​ నగరంలో జూన్ తర్వాత తొలిసారి వెయ్యి కేసులు నమోదయ్యాయి. కొలంబియా, పెరులో మొత్తం కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. ఫ్రాన్స్​లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి.

total covid deaths reached to 1 million mark
పది లక్షలకు చేరువగా కరోనా మరణాలు

By

Published : Sep 27, 2020, 10:22 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 2,94,650 కేసులు నమోదయ్యాయి. మరో 5,306 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 3 కోట్ల 30 లక్షలు దాటింది. మరణాల సంఖ్య 10 లక్షలకు చేరువైంది.

  • మొత్తం కేసులు:3,30,47,067
  • మొత్తం మరణాలు:9,98,285
  • రికవరీ అయినవారు:2,44,02,255
  • యాక్టివ్ కేసులు:76,46,527

దేశాలవారీగా చూస్తే

అమెరికాలో కరోనా విజృంభన కొనసాగుతూనే ఉంది. కొత్తగా 43 వేల మందికి కరోనా సోకినట్లు నిర్ధరణ అయింది. మరణాల సంఖ్య స్వల్పంగా తగ్గింది. 737 మంది మరణించగా మొత్తం మృతుల సంఖ్య 2.09 లక్షలకు చేరింది. మొత్తం కేసుల సంఖ్య 72 లక్షల 87 వేలకు చేరుకుంది. న్యూయార్క్​లో కరోనా తీవ్రమవుతోంది. జూన్ 5 తర్వాత ఒక్కరోజులో వెయ్యికిపైగా కొత్త కేసులు బయటపడ్డాయి.

బ్రెజిల్​లో మరో 25 వేల కేసులు నమోదయ్యాయి. 732 మంది మరణించారు. మొత్తం కేసులు 47 లక్షలు దాటిపోగా.. మరణాల సంఖ్య లక్షా 41 వేలకు పెరిగింది.

రష్యాలో మరో 7,523 మందికి పాజిటివ్​గా తేలింది. ఫలితంగా మొత్తం కేసులు 11.43 లక్షలకు పెరిగాయి. 169 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మరణాల సంఖ్య 20 వేల 225కు చేరింది.

కొలంబియా, పెరు దేశాల్లో కరోనా కేసుల సంఖ్య 8 లక్షల మార్క్ దాటింది. కొలంబియాలో కొత్తగా 7,721 కేసులు నమోదయ్యాయి. 193 మంది మరణించారు. పెరులో మరో 5,558 మందికి పాజిటివ్​గా తేలింది. 105 మంది మరణించారు.

ఫ్రాన్స్​లో కరోనా మళ్లీ ప్రబలుతోంది. 14 వేలకుపైగా కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. 39 మంది మరణించారు. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 5.27 లక్షలకు పెరిగింది. మరణాల సంఖ్య 31,700కి చేరింది.

పలు దేశాల్లో కరోనా కేసుల వివరాలు ఇలా...

దేశం కేసులు మరణాలు
అమెరికా 72,87,561 2,09,177
బ్రెజిల్ 47,18,115 1,41,441
రష్యా 11,43,571 20,225
కొలంబియా 8,06,038 25,296
పెరు 8,00,142 32,142
మెక్సికో 7,20,858 75,844
ఫ్రాన్స్ 5,27,446 31,700

ABOUT THE AUTHOR

...view details