తెలంగాణ

telangana

ETV Bharat / international

Tornado in America: సుడిగుండం.. పెను గండం.. - అమెరికాలో టోర్నడో

Tornado in America: టోర్నడోతో విధ్వంసంతో అమెరికాలో ఎటు చూసినా దెబ్బతిన్న భవంతులు, పైకప్పులు ఎగిరిపోయిన కర్మాగారాలు, కుప్పకూలిన స్తంభాలు, పడిపోయిన భారీ వృక్షాలే కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. వేడి వాతావరణం టోర్నడో రావడానికి ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇది ఇంతలా విరుచుకుపడడం వెనుక వాతావరణ మార్పులు ఏ మేరకు కారణమయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.

tornado in us 2021
అమెరికాలో టోర్నడో

By

Published : Dec 13, 2021, 6:55 AM IST

Tornado in America: అమెరికాలో విరుచుకుపడిన అకాల టోర్నడో పెను బీభత్సాన్ని సృష్టించింది. ఇక్కడ డిసెంబరులో భీకర తుపాన్లు చాలా అరుదు. కానీ ఇప్పుడు వచ్చిన ఈ టోర్నడో తీవ్రత, విస్తృతి వాతావరణ శాస్త్రవేత్తల్ని సైతం ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇదో కొత్త కేటగిరీ కిందకు వస్తుందని వారు చెబుతున్నారు. వందేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ టోర్నడో నేలపై కొనసాగిందని అంచనా. వేడి వాతావరణం దీనికో ప్రధాన కారణమని చెబుతున్నారు. ఇది ఇంతలా విరుచుకుపడడం వెనుక వాతావరణ మార్పులు ఏ మేరకు కారణమయ్యాయన్న దానిపై శాస్త్రవేత్తలు దృష్టిసారించారు.

What is Tornado?

ఇది సుడులు తిరుగుతూ నిట్టనిలువుగా చోటుచేసుకునే వాతావరణ పోకడ. ఉరుములు, మెరుపులను కలిగించే మేఘాల్లో (థండర్‌ క్లౌడ్స్‌) ఇవి ఏర్పడుతుంటాయి. గరాటా ఆకృతిలో నేలవరకూ విస్తరిస్తాయి. భీతావహ వేగంతో దూసుకెళతాయి. అవి పయనించే మార్గంలో పెను విధ్వంసం సృష్టిస్తాయి. నీటి తుంపర్లు, ధూళి, దుమ్ము, ఇతర శకలాలతో ఇవి తయారవుతుంటాయి.

How Tornado Form?

  • టోర్నడోలు అసాధారణ స్థాయి వేడి ఉన్నప్పుడు ఏర్పడతాయి. నేలపై ఉష్ణోగ్రత పెరిగినప్పుడు తేమతో కూడిన గాలి వేడెక్కి, పైకి లేస్తుంది.
  • ఇలా వేడి, తేమతో కూడిన గాలి.. ఎగువన ఉన్న చల్లటి, పొడి పవనాలను తాకినప్పడు థండర్‌ క్లౌడ్స్‌ ఏర్పడుతుంటాయి. దీన్ని ‘వాతావరణ అస్థిరత’గా అభివర్ణిస్తుంటారు. అది జరిగినప్పుడు గాలిపైకి కదలడం మొదలుపెడుతుంది. దీన్ని 'అప్‌డ్రాఫ్ట్‌' అంటారు.
  • విభిన్న ఎత్తుల్లో గాలుల వేగం, దిశల్లో మార్పుల (విండ్‌ షియర్‌) కారణంగా ఈ అప్‌డ్రాఫ్ట్‌ సుడి తిరగడం మొదలవుతుంది.
  • దిగువ వాతావరణంలో కొన్ని వేల అడుగుల పాటు ఈ వైరుధ్యం గణనీయ స్థాయిలో ఉన్నప్పుడు.. టోర్నడోను కలిగించే సూపర్‌సెల్‌ థండర్‌ క్లౌడ్స్‌ ఏర్పడతాయి. అమెరికాలో శనివారం జరిగింది ఇదే.
  • శీతాకాలంలో గాలిలో పెద్దగా వేడి, తేమ ఉండదుకాబట్టి టోర్నడోలకుఅవసరమైన స్థాయిలో అస్థిరతకు తావుండదు. అమెరికాలో ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.

What Causes a Tornado?

  • అమెరికాలోని మిడ్‌వెస్ట్‌, దక్షిణ ప్రాంతాల్లో డిసెంబర్‌లో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటం వల్ల వేడి, తేమతో కూడిన గాలి అక్కడికి వచ్చి చేరింది. ఇవి థండర్‌ క్లౌడ్స్‌ ఏర్పరిచాయి. దీనికి 'లా నినా' అనే వాతావరణ పోకడ కొంత మేర కారణమైంది. భూతాపం పెరుగుతున్న కొద్దీ శీతాకాలంలో వేడి వాతావరణం సర్వసాధారణంగా మారుతోందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
  • శనివారం నాటి ఘటనలో.. తుపాను తలెత్తాక అసాధారణ స్థాయిలో విండ్‌ షియర్‌ బలంగా ఉండటంతో టోర్నడో త్వరగా బలహీనపడకుండా చేసింది.
  • టోర్నడోలు సాధారణంగా నిమిషాల్లో శక్తిహీనమవుతుంటాయి. తాజా ఉదంతంలో మాత్రం అవి కొన్ని గంటల పాటు సాగాయి. అందువల్లే అది దాదాపు 322 కిలోమీటర్ల దూరం పయనించినట్లు సమాచారం.
  • 1925లో నాలుగు రాష్ట్రాలను కుదిపేసిన టోర్నడో 352 కిలోమీటర్లు దూసుకెళ్లింది. శనివారం నాటి టోర్నడో అంతకన్నా ఎక్కువ దూరం పయనించి ఉండొచ్చని కొందరు అంచనావేస్తున్నారు.
  • సుదీర్ఘ దూరం పయనించడానికి ఈ పెను తుపాను చాలా వేగంగా కదులుతుండాలి. తాజా టోర్నడో చాలా వరకూ గంటకు 80 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.
  • మరే దేశంలో లేని విధంగా అమెరికాలో ఏటా 1200 టోర్నడోలు సంభవిస్తున్నాయి.

చిగురుటాకులా వణికిన కౌంటీలు

Tornado Latest News: భీకర గాలులు, భారీ వర్షంతో వచ్చిన టోర్నడోతో అమెరికాలో పలు రాష్ట్రాలు, వాటిలోని కౌంటీలు వణికిపోయాయి. ఎటు చూసినా దెబ్బతిన్న భవంతులు, పైకప్పులు ఎగిరిపోయిన కర్మాగారాలు, కుప్పకూలిన స్తంభాలు, పడిపోయిన భారీ వృక్షాలే కనిపిస్తున్నాయి. చాలాచోట్ల రోడ్డు మార్గాలు స్తంభించిపోయాయి. డ్రోన్‌ ద్వారా చిత్రీకరించిన దృశ్యాలు.. పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నాయి. అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అధ్యక్షుడు జో బైడెన్‌ పేర్కొన్నారు. తీవ్రంగా దెబ్బతిన్న ప్రాంతాల్లో తాను పర్యటించనున్నట్లు ప్రకటించారు.

tornado in us 2021: విద్యుత్తు వ్యవస్థ పునరుద్ధరణ సహా సహాయక చర్యలను ముమ్మరం చేయడంపై యంత్రాంగం దృష్టి సారించింది. శిథిలాల్లో చిక్కుకుపోయి, ఆచూకీ గల్లంతైనవారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 70 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నా, ఇది వందకు మించి ఉంటుందని భయపడుతున్నారు. ఒక్క కెంటకీలోనే 22 మంది మృతి చెందారు. మేఫీల్డ్‌ పట్టణంలో ఎక్కువ భాగం నేలమట్టమైంది. కార్యాలయాలు, అపార్ట్‌మెంట్లు దెబ్బతిన్నాయి. విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. ధ్వంసమైన వాహనాలే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇల్లినోయీలో అమెజాన్‌ గిడ్డంగి కూలిన ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు తేలింది. ఉత్తర కాలిఫోర్నియా వైపు పయనిస్తున్న తుపాను కారణంగా సియెరా నెవడా పర్వత శిఖరంపై దాదాపు 10 అడుగుల మేర మంచు వర్షం కురుస్తుందని భావిస్తున్నారు. ఆదివారం మొదలైన ప్రభావం సోమ, మంగళవారాల్లో మరింత తీవ్రమవుతుందని వాతావరణ నిపుణులు తెలిపారు. మరో మూడు నాలుగు రోజుల్లో కాలిఫోర్నియాను టోర్నడో తాకనుంది.

ఇదీ చదవండి:

సుడిగాలుల బీభత్సం- ఎటుచూసినా భీతావహ దృశ్యాలే..

Tornado in America: టోర్నడో విధ్వంసం- కళ్లకు కట్టిన డ్రోన్​ వీడియోలు

ABOUT THE AUTHOR

...view details