Tornado in America: అమెరికా అయోవా రాష్ట్రంలో సంభవించిన సుడిగుండాల కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. మరో నలుగురు గాయపడ్డారు. సెంట్రల్ అయోవాలో ఏర్పడిన ఈ టోర్నడో ధాటికి పలు భవనాలు దెబ్బతిన్నాయి. చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకు ఒరిగాయి. దీంతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. పలు వాహనాలు దెబ్బతిన్నాయి.
అమెరికాలో టోర్నడో బీభత్సం- ఏడుగురు మృతి - అమెరికాలో టోర్నడో బీభత్సం ధాటికి ఏడుగురు మృతి
Tornado in America: అమెరికా అయోవా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగుండాల ధాటికి ఇద్దరు చిన్నారులు సహా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు చెప్పారు. బలమైన టోర్నడో కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి.
US TORNADO
అయోవా రాష్ట్ర రాజధాని డెస్ మోయిన్స్ సహా పలు ప్రాంతాల్లో సుడిగుండాలు ఏర్పడినట్లు అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో కూడిన మూడు సుడిగుండాలు ఏర్పడ్డాయని డెస్ మోయిన్స్‌లోని నేషనల్ వెదర్ సర్వీస్ ట్వీట్ చేసింది. ఈ టోర్నడో దాటికి 25 నుంచి 30 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పేర్కొంది.
ఇదీ చూడండి:పాలస్తీనాలో భారత రాయబారి హఠాన్మరణం
Last Updated : Mar 7, 2022, 2:53 AM IST