ఈ ఏడాది నవంబర్ 3న జరిగిన అధ్యక్ష ఎన్నికలు అమెరికా చరిత్రలో అత్యంత సురక్షితమైనవని ఫెడరల్ అధికారులు వెల్లడించారు. రాష్ట్రాల అధికారులతో పాటు ఎన్నికలకు సాంకేతికత అందించిన సంస్థలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
'ఈ ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత సురక్షితం' - అమెరికా ఎన్నికలు 2020
అమెరికా ఎన్నికలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తోన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు స్పష్టతనిచ్చారు. ఈ ఏడాది జరిగిన ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అత్యంత సురక్షితమైనవని తెలిపారు. అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేశారు.
అమెరికా
ఎన్నికల నిర్వహణపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వరుసగా ఆరోపణలు చేస్తోన్న నేపథ్యంలో సైబర్, ఇన్ఫ్రాస్ట్రక్షర్ సెక్యురిటీ ఏజెన్సీ మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఓట్లు తొలగించటం, మార్చడం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఇదీ చూడండి:'ఎన్నికల్లో మోసాల'పై ఆధారాల వేటలో ట్రంప్