తెలంగాణ

telangana

ETV Bharat / international

పొగాకుతో రోగాలు మాయం..! - పొగాకు

పొగాకు మొక్కలలో మానవసంబంధిత ప్రొటీన్​ అయిన ఇంటర్​ల్యూకిన్-37(ఐఎల్-37) ఎక్కువ పరిమాణంలో దొరుకుతుందని శాస్త్రజ్ఞులు తేల్చారు. దీనిలో హానికలిగించని, రోగనిరోధక శక్తిని పెంపొందించే శక్తిమంతమైన గుణాలు ఉన్నాయని గుర్తించారు.

పొగాకు

By

Published : Mar 1, 2019, 9:19 AM IST

పొగాకు ఆరోగ్యానికి హానికరం... పొగాకు సేవిస్తే చెల్లించక తప్పదు భారీ మూల్యం. ఈ మాటలు దైనందిన జీవితంలో ఎక్కడో ఓ చోట వింటూనే ఉంటాం. కానీ పొగాకు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందని ఎప్పుడైనా విన్నారా! డయాబెటీస్, గుండెపోటు, డిమెన్షియా, ఆర్థరైటిస్ లాంటి వ్యాధులు నయం చేయడంలో పొగాకు తోడ్పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

గాయాన్ని మాపుతుంది
అవయవ మార్పిడి జరిగినప్పుడు ఐఎల్​-37 ప్రొటీన్ చెడు వ్యాధుల బారిన పడకుండా నిరోధిస్తుంది. ఎక్కడైతే మార్పిడి జరిగిందో అక్కడ రక్త ప్రసరణ సమృద్ధిగా జరిగి గాయం(ఇన్​ఫ్లామేటరీ ఇంజూరీ) కాకుండా ముందుగానే నిరోధిస్తుందీ ప్రొటీన్.​

"ప్రస్తుతం అవలంబిస్తోన్న పద్ధతులు కంటే మొక్కలతో ఔషధాలు ఉత్పత్తి చేయడం చాలా సులభం . పొగాకు అధిక దిగుబడినిస్తుంది. మనకు కావాల్సినట్టు మార్చుకుని తేలికగా రెండు వారాల్లో ఐఎల్​-37ని తయారుచేయొచ్చు" --షేంగ్వూ మా, కెనాడా పశ్చిమ వర్సిటీ ఆచార్యులు.

"మానవుని మూత్రపిండమూ ఐఎల్-37 ప్రొటీన్​ను ఉత్పత్తి చేస్తుంది. అయితే కావాల్సినంత పరిమాణంలో ఈ ప్రొటీన్​ ఉత్పత్తి కాదు" --టోనీ జెవ్నికర్, కెనడా పశ్చిమ వర్సిటీ ఆచార్యులు.

ఇతర పద్ధతుల్లో ఖర్చెక్కువ
జంతువుల్లోనూ ఎక్కువ పరిమాణంలో ఐఎల్​-37 ప్రొటీన్​ లభ్యం కాదు. ప్రస్తుతానికి 'బ్యాక్టీరియా ఈ కోలీ' అనే ప్రోటీన్​ను ఉపయోగిస్తున్నప్పటికీ ఇది చాలా ఖరీదైనది. మొక్కలలో మానవ సంబంధిత ప్రొటీన్ కోసం పరిశోధించడం ఇదే తొలిసారి.

ABOUT THE AUTHOR

...view details