తెలంగాణ

telangana

ETV Bharat / international

ఎయిడ్స్​ను జయించిన తొలి వ్యక్తిని.. క్యాన్సర్​ కాటేసింది

ప్రపంచంలో ఎయిడ్స్​ను జయించిన మొదటి వ్యక్తి క్యాన్సర్​తో మరణించారు. అమెరికా కాలిఫోర్నియాలోని తన నివాసంలో ఇవాళ మృతి చెందారు బ్రౌన్​. ఈ విషయాన్ని అతని భాగస్వామి సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు.

Timothy Ray Brown, 1st person cured of HIV, dies of cancer
ఎయిడ్స్​ నుంచి కొలుకున్న తొలి వ్యక్తి- క్యాన్సర్​తో మృతి

By

Published : Sep 30, 2020, 9:57 PM IST

Updated : Sep 30, 2020, 10:36 PM IST

ప్రపంచంలో భయంకరమైన వ్యాధుల్లో ఎయిడ్స్​ ఒకటి. ఈ వ్యాధికి ప్రతి ఏటా కోట్ల మంది బాధితులవుతున్నారు. మనిషిని నిస్సత్తువగా మార్చి జీవితాంతం వెంటానే ఈ మహమ్మారిని.. కచ్చితంగా జయించగలమే ధైర్యాన్ని, ధీమాను పరిశోధకులకు ఇచ్చిన వ్యక్తి తిమోతీ రే బ్రౌన్. అందుకే ఎయిడ్స్​ను మనోధైర్యంతో ఎదిరించిన అతడిని.. ఎయిడ్స్​ పరిశోధనల్లో ఓ ఆశాకిరణంగా పేర్కొంటారు. ఇతడిని 'బెర్లిన్ రోగి' అని కూడా పిలుస్తారు. ప్రపంచంలో ఎయిడ్స్​ను జయించిన తొలి వ్యక్తి ఈయనే. అలాంటి పోరాట యోధుడు బ్రౌన్.. క్యాన్సర్​ ముంగిట తలవంచారు. ఇవాళ బ్రౌన్​ తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన సతీమణి సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపారు.

1995 నుంచి ఎయిడ్స్​తో బాధపడుతున్న బ్రౌన్​... తాజాగా రక్త క్యాన్సర్​(లుకేమియా)​తో చనిపోయారు. క్యాన్సర్​ చికిత్సలో భాగంగా 2007లో 'మూల కణ మార్పిడి' ( స్టెమ్ సెల్ ట్రాన్స్​ప్లాంటేషన్​) చేయించుకున్నారు​. ఫలితంగా అద్భుతం జరిగినట్లు ఎయిడ్స్​ పూర్తిగా నయమైంది. కానీ లుకేమియా తీవ్రత పెరిగింది. దీంతో రెండోసారి 2008లో మళ్లీ ఎముక మజ్జ మార్పిడి చేయించుకున్నా ఆశించిన ఫలితం రాలేదు. గతేడాది నుంచి క్యాన్సర్ తీవ్రత మరింతగా పెరిగింది. ఎయిడ్స్​ను జయించిన బ్రౌన్​.. క్యాన్సర్​కు చికిత్స పొందుతూనే 54 ఏట తుది శ్వాస విడిచారు.

ఇదీ చూడండి:ఎయిడ్స్​ నుంచి పూర్తిగా కోలుకున్న రెండో వ్యక్తి ఇతనే!

Last Updated : Sep 30, 2020, 10:36 PM IST

ABOUT THE AUTHOR

...view details