ఆగస్టు 5న అమెరికా న్యూయార్క్‌లోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్వ్లో శ్రీరాముని చిత్రాల ప్రదర్శనతో సందడి చేయనున్నారు భారతీయులు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం జరగనున్న నేపథ్యంలో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. చారిత్రక ఘట్టం ఆవిష్కృతమవుతున్న సందర్బంగా భారీ స్థాయిలో ఉత్సవం నిర్వహించాలని భావిస్తున్నట్లు భారత అమెరికన్ ప్రజా వ్యవహారాల కమిటీ తెలిపింది.
అతిపెద్ద తెరపై
టైమ్స్ స్క్వేర్స్లోని నాస్డాక్ స్క్రీన్ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ స్క్రీన్‌తో పాటు 17వేల అడుగుల చదరపు అడుగుల ఎల్ఈడీ తెరపై శ్రీరాముని ఫొటోలు, త్రీడీ చిత్రాలను ప్రదర్శించనున్నారు.