అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విధించిన నిషేధాన్ని అడ్డుకోవాలని న్యాయమూర్తిని కోరింది చైనాకు చెందిన టిక్‌టాక్ సంస్థ. ట్రంప్ కార్వనిర్వాహక ఆదేశాలు చట్ట విరుద్ధమని ఆరోపించింది. జాతీయ భద్రత చట్టం కింద ఈ నిర్ణయం తీసుకునే అధికారం అధ్యక్షుడికి లేదని తెలిపింది.
ట్రంప్ ఆదేశాలపై న్యాయ సమీక్ష కోరుతూ కొలంబియాలోని ఫెడరల్ కోర్టును ఆశ్రయించింది టిక్‌టాక్. ట్రంప్ ఆదేశాలు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ, హక్కులు కాలరాసినట్టేనని ఆరోపించింది ఈ చైనా సంస్థ. ఒరాకిల్, వాల్‌మార్ట్‌తో ఒప్పందం చేసుకునేలా ఒత్తిడి తెస్తున్నారంటూ వివరించింది.
ఆగస్టు ఆదేశాలు..
జాతీయ భద్రతకు ముప్పు ఉందని చైనాకు చెందిన టిక్‌టాక్, వీచాట్ యాప్‌లపై నిషేధం విధిస్తూ ఆగస్టులో ట్రంప్ కార్వనిర్వాహక ఆదేశాలు జారీ చేశారు. టిక్‌టాక్ యూఎస్ కార్యకలాపాలను సెప్టెంబరు 15లోగా.. అమెరికా కంపెనీకి విక్రయించాలని ఇందులో స్పష్టం చేశారు. లేదంటే వేటు ఎదుర్కోక తప్పదని పేర్కొన్నారు.