తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా క్యాపిటల్‌ భవనంలో ఘర్షణ- ముగ్గురు మృతి - undefined

Three people were killed in clashes at the Capitol building
అమెరికా క్యాపిటల్‌ భవనంలో ఘర్షణ- ముగ్గురు మృతి

By

Published : Jan 7, 2021, 9:53 AM IST

Updated : Jan 7, 2021, 10:57 AM IST

09:50 January 07

క్యాపిటల్‌ భవనంలో ఘర్షణ- ముగ్గురు మృతి

అమెరికా క్యాపిటల్‌ భవనంలో జరిగిన ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు. పోలీసుల కాల్పుల్లో ఇప్పటికే ఒకరు చనిపోగా.. ఘర్షణల్లో ముగ్గురు మృతి చెందారు.

'ఎలక్టోరల్​ సమావేశంలోకి వెళ్లడానికి ప్రయత్నించిన ట్రంప్​ మద్దతుదారులు, పోలీసులకు జరిగిన ఘర్షణల్లో భాగంగా కాల్పులు జరిగాయి. మొదట ఓ యువతి మృతి చెందగా.. తాజాగా మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారని' వాషింగ్టన్​ డీసీ పోలీసు చీఫ్ రాబర్ట్ కౌంటీ తెలిపారు.

పోలీసులపై రసాయనాలను చల్లిన ట్రంప్​ అనుచరులు.. క్యాపిటల్ భవనాన్ని కొన్ని గంటల పాటు ఆక్రమించుకున్నారు. తర్వాత కొద్దిసేపటికి పరిస్థితి అదుపులోకి వచ్చింది. నిరసనకారుల నుంచి రెండు పైపు బాంబులతో సహా ఓ పొడవైన తుపాకీని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు అధికారులు తెలిపారు. 

Last Updated : Jan 7, 2021, 10:57 AM IST

For All Latest Updates

TAGGED:

.

ABOUT THE AUTHOR

...view details