తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో ఆగని కార్చిచ్చు - ముగ్గురు మృతి - అమెరికాలో కార్చిచ్చు బీభత్సం

అమెరికాలో కార్చిచ్చు ఉద్ధృతి ఏ మాత్రం తగ్గడం లేదు. ఉత్తర కాలిఫోర్నియాలో వ్యాపించిన మంటల ధాటికి ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. సుమారు 70వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

Three killed in Northern California wildfire; thousands flee
అమెరికాలో కార్చిచ్చు బీభత్సం- ముగ్గురు మృతి

By

Published : Sep 29, 2020, 11:58 AM IST

అమెరికాలో కార్చిచ్చు అంతకంతకూ విస్తరిస్తోంది. ఉత్తర కాలిఫోర్నియాలో చెలరేగుతున్న మంటల ధాటికి ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. అంతకంతకూ వ్యాపిస్తోన్న మంటలతో నాపా, సొనోమా కౌంటీల్లో అనేక నివాసాలు కాలి బూడిదయ్యాయి. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బింది.. మంటలను ఆర్పే ప్రయత్నాలు చేస్తున్నారు. ముందస్తు చర్యల్లో భాగంగా ముప్పు ప్రాంతాల్లోని 70 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు.

అమెరికాలో కార్చిచ్చు బీభత్సం- ముగ్గురు మృతి
కాలిపోతున్న జనావాసాలు

బే ప్రాంతంలో 27 చోట్ల చెలరేగిన మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించగా.. ఇప్పటికే సుమారు 19వేల ఎకరాలు బూడిదైంది. మరో 8,500పైగా నిర్మాణాలకు ముప్పు పొంచి ఉన్నట్టు అధికారులు తెలిపారు.

అంతకంతకూ వ్యాపిస్తోన్న మంటలు
మంటల ధాటికి దట్టంగా అలుముకున్న పొగలు

కార్చిచ్చు ప్రభావంతో అక్కడ రోజంతా వేడి వాతావరణం నెలకొందని ఓ అగ్నిమాపక అధికారి తెలిపారు. భారీ ఎత్తున పొగ కమ్ముకోవడం వల్ల విమాన సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఫలితంగా శాంటా రోజా ప్రాంతంలో విమాన సేవలు నిలిచిపోయాయి.

కాలిబూడిదైన జనావాసాలు

ఇదీ చదవండి:ధరణి గుండెల్లో గుబులు రేపుతున్న భూతాపం

ABOUT THE AUTHOR

...view details