తెలంగాణ

telangana

ETV Bharat / international

3 భారతీయ సంస్థల్లో నాసా వెంటిలేటర్ల తయారీ

నాసాకు చెందిన జేపీఎల్​ సంస్థ డిజైన్​ చేసిన వెంటిలేటర్ల తయారీలో 3 భారతీయ కంపెనీలకు భాగస్వామ్యం దక్కింది. ఆల్ఫా డిజైన్​ టెక్నాలజీస్, భారత్​ ఫోర్జ్, మేధా సర్వో డ్రైవ్స్​... త్వరలోనే ఉత్పత్తి ప్రారంభించనున్నాయి.

Three Indian companies to manufacture NASA developed ventilator
నాసా​ వెంటిలేటర్ల తయారీలో 3 భారత కంపెనీలకు చోటు

By

Published : Jun 3, 2020, 3:38 PM IST

అమెరికన్​ అంతరిక్ష పరిశోధనా సంస్థ-నాసాకు చెందిన జెట్​ ప్రొపల్షన్​ ల్యాబోరేటరీస్​(జేపీఎల్​) అభివృద్ధి చేసిన చౌక వెంటిలేటర్ల ఉత్పత్తికి మూడు భారతీయ సంస్థలు ఎంపికయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా 21 కంపెనీలకు లైసెన్స్​ లభించగా.. అందులో భారత్​​ నుంచి ఆల్ఫా డిజైన్​ టెక్నాలజీస్​, భారత్​ ఫోర్జ్​, మేధా సెర్వో డ్రైవ్స్​కు ఈ అవకాశం దక్కింది.

'వెంటిలేటర్ల తయారీ కోసం నాసా ఎంపిక చేసిన మూడు భారతీయ కంపెనీలకు అభినందనలు. ప్రపంచవ్యాప్తంగా 21 కంపెనీలలో 3 భారత కంపెనీలు ఉండటం.. కరోనాపై పోరాటంలో భారత ప్రాముఖ్యాన్ని తెలియజేస్తోంది.'

- భారత విదేశాంగ శాఖ

ఎందుకింత ప్రత్యేకత..?

కరోనా సంక్షోభంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా వెంటిలేటర్ల కొరత ఏర్పడింది. అందుకే వేర్వేరు సంస్థలు వాటి తయారీపై దృష్టిపెట్టాయి. దక్షిణ కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే జేపీఎల్​ వైటల్​ పేరిట కొత్త రకం వెంటిలేటర్లను డిజైన్ చేసింది. సంప్రదాయ వెంటిలేటర్లలోని విడి భాగాల్లో ఏడో వంతుతో రూపొందించడం ఈ వైటల్​ వెంటిలేటర్ల ప్రత్యేకత. అధునాతన ఫీచర్లతో రూపొందిన వీటిని తాత్కాలిక ఆస్పత్రుల్లోనూ సులభరీతిలో వినియోగించుకునే వీలు ఉంటుంది.

'ఎఫ్​డీఏ' ఓకే..

వైటల్​ వెంటిలేటర్​ను ఏప్రిల్​ 3న మౌంట్​ సినాయ్​లో 'హ్యూమన్​ సిమ్యులేషన్​ ల్యాబ్'​ పరీక్షించింది. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కొనే పరిష్కార మార్గాల్లో వైటల్​ పరిజ్ఞానం కీలకం కానుందని అక్కడి వైద్య బృందం పేర్కొంది. వైటల్​కు.. అమెరికన్​ ఫుడ్​ అండ్​ డ్రగ్​ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్​డీఏ)​ సంస్థ అనుమతి కూడా లభించింది.

ఇదీ చదవండి:శీతాకాలం కరోనా కాలమే! మరింత విజృంభించే అవకాశం

ABOUT THE AUTHOR

...view details