బ్రెజిల్ ప్రధాని జైర్ బొల్సొనారోకు వ్యతిరేకంగా ఆ దేశంలో వరుసగా రెండో రోజూ నిరసనలు కొనసాగాయి. కరోనా నియంత్రణలో విఫలమయ్యారంటూ పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి చేరుకొని ఆందోళన చేశారు. బొల్సొనారోపై అభిశంసన తీర్మానం పెట్టాలని డిమాండ్ చేశారు. నిరసనకారుల కార్లతో రాజధాని రియో డి జెనీరో వీధులు మోతెక్కాయి.
ఆ ప్రధానిపై అభిశంసన తీర్మానానికి డిమాండ్ - brazil president impeachment
బ్రెజిల్ ప్రధానికి వ్యతిరేకంగా ఆ దేశంలో ఆందోళనలు రెండో రోజూ కొనసాగాయి. కరోనా కట్టడిలో విఫలమయ్యారని, ఆయనపై అభిశంసన తీర్మానం పెట్టాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
బొల్సొనారోపై అభిశంసన తీర్మానానికి డిమాండ్
కరోనాకు చికిత్స అందించే ఆస్పత్రుల్లో వసతుల కొరత తీవ్రంగా ఉందని నిరసనకారులు ఆరోపించారు. దేశంలో రాజకీయ పరిస్థితిని మార్చేందుకు అభిశంసన ప్రవేశపెట్టడం ఒక్కటే మార్గమని అన్నారు.