కాలిఫోర్నియాలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. తాజాగా లాస్ ఏంజెలెస్‌లోని వెంచురా ప్రాంతంలో మరియా ఫైర్ అని పిలుస్తున్న కార్చిచ్చు తీవ్ర నష్టం కలిగించింది. 9 వేల ఎకరాల వరకు మంటలు విస్తరించాయి. వేలాది మంది ప్రజలు తమ నివాసాలను విడిచి ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు.
వేల ఎకరాలను ధ్వంసం చేస్తోన్న కార్చిచ్చు - కాలిఫోర్నియా తాజా వార్తలు
కాలిఫోర్నియాలో మరియా ఫైర్ కారణంగా ప్రజలు విలవిల్లాడుతున్నారు. లాస్ ఏంజెలెస్‌లోని వెంచురా ప్రాంతంలో సుమారు 9 వేల ఎకరాల వరకు కార్చిచ్చు విస్తరించింది. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నా మంటల ఉద్ధృతి.. వారి చర్యలకు ఆటంకం కలిగిస్తోందని అధికారులు తెలిపారు.

వేల ఎకరాలను ధ్వంసం చేస్తోన్న కార్చిచ్చు
వేల ఎకరాలను ధ్వంసం చేస్తోన్న కార్చిచ్చు
మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నా వేడిగాలుల కారణంగా.. సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. విమానాల సాయంతో మంటలను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు సిబ్బంది.
ఇదీ చూడండి:ఇందిరా గాంధీకి కాంగ్రెస్ ప్రముఖుల ఘన నివాళి
Last Updated : Nov 2, 2019, 7:57 PM IST