తెలంగాణ

telangana

ETV Bharat / international

సైన్యాన్ని వీడాలనుకున్నా.. కరోనాతో యూ టర్న్​ - అమెరికా మిలిటరీ

అమెరికా సైన్యాన్ని వీడాలనుకున్న వేలాది మంది.. ఇప్పుడు ఆ ఆలోచనను విరమించుకుంటున్నారు. కరోనా సంక్షోభంతో అగ్రరాజ్యంలో నిరుద్యోగం పెరిగిపోయిన నేపథ్యంలో సైన్యంలో ఉద్యోగమే భద్రమని అనుకుంటున్నారు.

Thousands defer plans to leave the military during crisis
సైన్యాన్ని విడాలన్న ఆలోచనకు 'కరోనా' చెక్​!

By

Published : May 18, 2020, 2:44 PM IST

అమెరికాలో నిరుద్యోగం సమస్య ఎన్నడూ లేనంతగా పెరిగిపోయింది. ఇందుకు ప్రధాన కారణం కరోనా వైరస్​. అగ్రరాజ్య సైన్యానికీ ఈ సెగ తగిలింది. అయితే.. మిలిటరీలోని వారిని విధుల నుంచి తొలగించడం లేదు. అందుకే సైన్యంలో తిరిగి చేరాలనుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది.

కరోనా పరిస్థితులే కారణం...

ఆర్మీ సర్జెంట్​ ఆంటోనియో గోజికోవ్​స్కి.. ఆరేళ్ల పాటు డెంటల్​ అసిస్టెంట్​గా సైన్యంలో విధులు నిర్వహించారు. తాజాగా సైన్యాన్ని వీడి దంతవైద్యుడు అవ్వాలనుకున్నారు. ఆ తర్వాత సరిపడా నైపుణ్యంతో తిరిగి సైన్యంలో చేరాలనుకున్నారు.

అయితే కరోనా వైరస్​ విజృంభణతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. కళాశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సైన్యాన్ని వీడాలన్న ఆలోచనను విరమించుకున్నారు ఆంటోనియో. నూతన సైనిక విధానం ద్వారా తన సర్వీసును మరో 6 నెలలపాటు పొడిగించుకున్నారు.

దేశంలో నిరుద్యోగ సమస్య పెరిగిపోతున్న తరుణంలో మిలిటరీలో ఉద్యోగ భద్రత ఉంటుందని ఆంటోనియో లాంటి వారు అందరూ విశ్వసిస్తున్నారు. సరైన సమయానికి జీతాలు కూడా అందడం వల్ల సైన్యాన్ని వీడడానికి ఇష్టపడటం లేదు. ఇలా దాదాపు 52వేల మంది సైన్యంలోనే కొనసాగాలని నిశ్చయించుకున్నారు.

కరోనా సంక్షోభవం వల్ల అగ్రరాజ్య వాయు సేనలో నియామకాలు నిలిచిపోయాయి. ఫలితంగా దాదాపు 5వేల 800 ఖాళీలు ఏర్పడ్డాయి. స్వచ్ఛందంగా ముందుకొచ్చి మిలిటరీలోనే ఉండాలనుకుంటున్న వారిని ఈ సేవలకు వినియోగించుకుంటారు.

ABOUT THE AUTHOR

...view details