తెలంగాణ

telangana

ETV Bharat / international

ట్రంప్​కు మద్దతుగా అమెరికాలో భారీ ర్యాలీలు - Whitehouse news updates

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వారం రోజుల తర్వాత శ్వేతసౌధం ముందు ట్రంప్​ మద్దతుదారులు సమావేశమయ్యారు. ట్రంప్​నకు మద్దతుగా పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఫలితాలను నిరసిస్తూ ఆందోళనలు చేశారు.

Thousands attend march in DC to support Trump
శ్వేతసౌధం ముందు గుమిగూడిన ట్రంప్​ అభిమానులు

By

Published : Nov 15, 2020, 7:17 AM IST

Updated : Nov 15, 2020, 7:59 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​నకు మద్దతుగా భారీగా నిరసనలు చేపట్టారు ఆయన అభిమానులు. అధ్యక్ష ఎన్నికల్లో జోబైడెన్‌ గెలిచిన వారం రోజుల తర్వాత దేశ రాజధానిలో సమావేశమైన ట్రంప్‌ మద్దతుదారులు... ఫలితాలను నిరసిస్తూ, ఓట్లు దొంగిలించారని ఆరోపణలు చేశారు. వేలాది మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

శ్వేతసౌధం ముందు గుమిగూడిన జనం
ప్లకార్డు పదర్శిస్తున్న ట్రంప్​ అభిమాని
భారీ సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న ట్రంప్​ మద్దతుదారులు

ఈ నేపథ్యంలో శ్వేతసౌధం ముందు భారీఎత్తున ట్రంప్‌ అభిమానులు వాహనాలతో వచ్చిగుమిగూడారు. వర్జీనియా గోల్ఫ్‌ క్లబ్‌కి వెళ్లే దారిలో ట్రంప్‌ మద్దతుదారులు నెమ్మదిగా వాహనాలు నడిపారు. ట్రంప్‌ వాహనానికి దగ్గరిగా వెళ్లిన మద్దతుదారులు... సమీప వీధికి ఇరువైపులా నిల్చున్నారు. ఆయనకి ఉత్సాహంగా అభివాదం చేశారు.

ట్రంప్​నకు మద్దతుగా నిరసనలు

ఇదీ చూడండి:ఈజిప్ట్​లో బయటపడ్డ 300ఏళ్లనాటి శవపేటికలు

Last Updated : Nov 15, 2020, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details