తెలంగాణ

telangana

ETV Bharat / international

చిలీ ఆందోళనలు ఉద్రిక్తం..వేల మందికి గాయాలు - చిలీ తాజా నిరసనలు

చిలీ రాజధాని శాంటియాగోలో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. నిరసనకారులను చెదరగొట్టేందుకు జల ఫిరంగులు, బాష్పవాయువు గోళాలు ప్రయోగించారు పోలీసులు. ఈ ఘర్షణల్లో వేల మంది గాయపడ్డారు. 300 ప్రజలు తీవ్రమైన కంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

chili protests
చిలీ నిరసనలు

By

Published : Dec 21, 2019, 11:28 AM IST

Updated : Dec 21, 2019, 12:40 PM IST

చిలీ ఆందోళనలు ఉద్రిక్తం..వేల మందికి గాయాలు

చిలీ దేశంలో మెట్రో రేట్ల పెంపునకు నిరసనగా ప్రారంభమైన ఆందోళనలు చిలికి చిలికి గాలివానగా మారాయి. ప్రభుత్వం వెనక్కి తగ్గినా.. దేశ ఆర్థిక స్థితి, వైద్య, విద్యా రంగాల్లో అసమానతలపై గత 2 నెలలుగా చిలీ నిరసనలతో అట్టుడుకుతోంది. రాజధాని శాంటియాగోలో శుక్రవారం వేల మంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చారు.

వారిని అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జల ఫిరంగులు, బాష్ప వాయువును ప్రయోగించారు భద్రతా సిబ్బంది. ఈ ఘటనలో వేల మంది గాయపడ్డారు. 300 మందికి పైగా తీవ్రమైన కంటి గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.

26 మంది మృతి..

అక్టోబర్​ 18న మొదలైన ఆందోళనల్లో ఇప్పటి వరకు 26 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. 2210 మంది భద్రతా సిబ్బంది గాయపడ్డారు. 188 పోలీస్ ​స్టేషన్లతో సహా 971 పోలీస్​ వాహనాలు ధ్వంసమయ్యాయి.

చిలీలో మానవ హక్కులకు.. అక్కడి పోలీసులు, సైన్యం తీవ్రంగా ఆటంకం కలిగిస్తున్నాయని.. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.


ఇదీ చూడండి : ఆలోచన అదుర్స్​... ప్లాస్టిక్​ వ్యర్థాలతో టీ-షర్టుల తయారీ

Last Updated : Dec 21, 2019, 12:40 PM IST

ABOUT THE AUTHOR

...view details