తెలంగాణ

telangana

ETV Bharat / international

'వాతావరణ లక్ష్యాన్ని కలిసి సాధిస్తాం' - ముగిసిన వాతావరణ మార్పు సదస్సు

గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను అరికట్టడానికి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి తమ శాయశక్తులా కృషి చేస్తామని అమెరికా సహా అరడజను దేశాలు హామీఇచ్చాయి. దాదాపు 40 దేశాల నేతలు, సంఘాలు, వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్న రెండ్రోజుల వర్చువల్‌ సదస్సును బైడెన్‌ శుక్రవారం సాయంత్రం ముగించారు.

biden
బైడెన్, వాతావరణ మార్పు

By

Published : Apr 24, 2021, 8:01 AM IST

ప్రపంచ దేశాలన్నీ ఉమ్మడిగా ఉద్యమిస్తే తప్ప వాతావరణ మార్పుల్ని అరికట్టలేమని వివిధ దేశాల నేతలు నొక్కిచెప్పారు. ఈ మేరకు కెన్యా అధ్యక్షుడు ఉహురూ మ్యుగాయ్‌ కెన్యట్టా చేసిన సూచనతో ఏకీభవించారు. "ఈ లక్ష్యాన్ని మేమంతా కలిసి సాధించబోతున్నాం" అని అమెరికా నేతృత్వంలో జరిగిన వాతావరణ సదస్సు వేదికగా వారు ప్రతిజ్ఞ చేశారు.

గ్రీన్‌హౌస్‌ వాయు ఉద్గారాలను అరికట్టడానికి, శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి తమ శాయశక్తులా కృషిచేస్తామని అమెరికా సహా అరడజను దేశాలు హామీఇచ్చాయి. ఈ దశాబ్దంలో బొగ్గు, పెట్రోలియం ఉద్గారాలను తగ్గించాలన్న తమ లక్ష్యాన్ని రెండింతలు చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ప్రకటించారు.

దాదాపు 40 దేశాల నేతలు, సంఘాలు, వాణిజ్య ప్రతినిధులు పాల్గొన్న రెండ్రోజుల వర్చువల్‌ సదస్సును బైడెన్‌ శుక్రవారం సాయంత్రం ముగించారు. భావితరాలకు పరిశుద్ధ ఆర్థిక వ్యవస్థల్ని అందించడానికి ప్రపంచవ్యాప్తంగా పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. శిలాజ ఇంధనాల నుంచి వాతావరణానికి ఏర్పడుతున్న ముప్పును తగ్గించడానికి తమ దేశాల్లో చేపట్టిన చర్యల్ని వివిధ దేశాల నేతలు ఈ సదస్సులో పంచుకున్నారు.

ఇదీ చదవండి:బోటు మునిగి 130 మంది మృతి!

ABOUT THE AUTHOR

...view details