తెలంగాణ

telangana

By

Published : Oct 30, 2020, 12:46 PM IST

ETV Bharat / international

బైడెన్‌ వస్తే అమెరికా మరో వెనిజువెలా: ట్రంప్‌

అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరపడుతున్న కొలదీ అధికార, విపక్షాల మధ్య రగడ నానాటికీ పెరిగిపోతూనే ఉంది. డొనాల్డ్​ ట్రంప్​, జో బైడెన్​ల మధ్య మాటల యుద్జం కొనసాగుతోంది. డెమొక్రాటిక్​ అభ్యర్థి బైెెడెన్​పై, రిపబ్లికన్​ పార్టీ అభ్యర్థి ట్రంప్​.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బైడెన్​లాంటి చెత్త అభ్యర్థిని తానింతవరకూ చూడలేదన్న అమెరికా అధ్యక్షుడు.. ఈ బైడెన్​ గెలిస్తే దేశం మరో వెనిజువెలా అవుతుందన్నారు.

This election is choice between 'American dream' and 'socialist nightmare': Trump
బైడెన్‌ వస్తే అమెరికా మరో వెనిజులా: ట్రంప్‌

అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న కొలదీ విమర్శలు, ప్రతి విమర్శల తీవ్రత పెరిగిపోతోంది. రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రాటిక్‌ అభ్యర్థి బైడెన్‌ మధ్య మాటల యుద్ధం హద్దులు మీరుతోంది. అధ్యక్ష అభ్యర్థులు హుందాగా ప్రవర్తించడం పోయి.. స్థాయి తగ్గించుకొని మాట్లాడుతున్నారని ఇప్పటికే విమర్శలు చెలరేగాయి. చాలాసార్లు వీరిద్దరి వాద ప్రతివాదనలు వ్యక్తిగత విమర్శల వరకూ వెళ్లాయి. అయితే.. తాజాగా ట్రంప్‌ మరోసారి నోరుపారేసుకున్నారు. బైడెన్‌ లాంటి 'చెత్త' అభ్యర్థిని అమెరికా ఎన్నికల చరిత్రలోనే చూడలేదని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రస్తుత ఎన్నికలు అమెరికా కలలకు.. సోషలిస్టులు, పీడకలలకు మధ్య జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.

'మరో వెనిజువెలాలా మారిపోతుంది'

ఎన్నికల ప్రచారంలో భాగంగా మెలానియాతో కలిసి గురువారం టంపాలో‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ట్రంప్. ఒకవేళ బైడెన్‌ అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనిజువెలా మాదిరిగా మారిపోతుందని అన్నారు. ''దురదృష్టవశాత్తు డెమొక్రాట్లు అధికారంలోకి వస్తే అమెరికా మరో వెనెజువెలా లాగా తయారైపోతుంది. కానీ.. తాను అధికారంలో ఉన్నంత వరకూ అమెరికా ఎట్టిపరిస్థితుల్లోనూ సోషలిస్టు దేశంగా మారదు'' అని ట్రంప్‌ అన్నారు.

మన పిల్లలు అమెరికా కలలను వారసత్వంగా పొందాలో? లేదా సోషలిజం మాయలోపడి భవిష్యత్తును నాశనం చేసుకోవాలో ఈ ఎన్నికలే నిర్ణయిస్తాయని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. ‘‘మనం మార్క్సిస్టులను, సోషలిస్టులను, అల్లరి మూకలను, వామపకక్ష తీవ్రవాదులను ఓడించ బోతున్నాం. అమెరికా ప్రజల కోసం మనం పోరాడబోతున్నాం.’’ అంటూ ఓటర్లను ఉత్తేజపరిచే ప్రయత్నం చేశారు.

కష్టపడిన వారికే ఓట్లు..

అత్యంత చెత్త ప్రత్యర్థిపై పోటీ చేయాల్సిరావడం బాధగా ఉందని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. బైడెన్‌ సోషలిస్టు భావజాలంతో ఉన్నారని, ఆయన అధికారంలోకి వచ్చినా అమెరికా అభివృద్ధి కుంటుపడుతుందని విమర్శించారు. మరోవైపు కీలకరాష్ట్రాల్లో ట్రంప్‌ కంటే బైడెన్‌వైపే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సర్వేలు చెబుతుండటంపై ఆయన స్పందించారు. ఎవరెన్ని చెప్పినా కష్టపడి పని చేసేవారికే ప్రజలు ఓటు వేస్తారని, రిపబ్లికన్‌ పార్టీ గెలుపు తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. మరో నాలుగేళ్లు తాను శ్వేతసౌధంలో ఉండటం ఖాయమన్నారు. రికార్డు స్థాయిలో భారీ విజయం నమోదు చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికా అధ్యక్ష పీఠానికి నవంబర్‌ 3న ఎన్నికలు జరగనున్నాయి.

ఇదీ చదవండి-అమెరికా అధ్యక్ష ఎన్నికల ఖర్చు రూ.లక్ష కోట్లు!

ABOUT THE AUTHOR

...view details