తెలంగాణ

telangana

ETV Bharat / international

'డిసెంబర్​ చివరి నాటికి అందుబాటులోకి వ్యాక్సిన్​!' - బైడెన్​ వార్తలు

దేశ ప్రజలకు డిసెంబర్​ చివరి నాటికి కొవిడ్​ వ్యాక్సిన్​ అందుబాటులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. టీకా అభివృద్ధిలో గణనీయమైన పురోగతి కనిపిస్తోందని, పలు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు.

Jeo Biden
జో బైడెన్

By

Published : Nov 26, 2020, 7:17 AM IST

కొవిడ్​-19 వ్యాక్సిన్​ అభివృద్ధిలో ఇటీవల గణనీయమైన పురోగతి కనిపించిందన్నారు అమెరికా అధ్యక్ష ఎన్నికల విజేత జో బైడెన్​. అందులో పలు వ్యాక్సిన్లు ప్రభావవంతంగా ఉన్నాయని తెలిపారు. దీంతో ఈ ఏడాది డిసెంబర్​ చివర్లో లేదా జనవరి తొలినాళ్లలోనే టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం అయ్యే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.

వీలైనంత త్వరగా దేశవ్యాప్తంగా వ్యాక్సిన్​ పంపిణీ చేసేందుకు సరైన ప్రణాళికను రూపొందించాలని, అది తాము చేసి తీరుతామన్నారు బైడెన్​. అయితే.. దానికి కాస్త సమయం పడుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:'70శాతం మంది మాస్కు వాడితే కరోనా అంతం'

ABOUT THE AUTHOR

...view details