తెలంగాణ

telangana

ETV Bharat / international

ఐఎస్​ అగ్రనేత బాగ్దాదీ హతం.. అమెరికా ప్రకటన - donald trump to make statement on Abu Bakr al-Baghdadi

ఐఎస్​ అగ్రనేత అబు బకర్​ అల్​ బాగ్దాదీ హతం!

By

Published : Oct 27, 2019, 9:49 AM IST

Updated : Oct 27, 2019, 9:24 PM IST

21:18 October 27

బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు

బాగ్దాదీ కుక్కచావు చచ్చాడు

ఇస్లామిక్‌ స్టేట్‌ వ్యవస్థాపకుడు అబు బకర్‌ అల్‌ బాగ్దాదీ కుక్క చావు చచ్చాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. ఆదివారం శ్వేతసౌధంలో ఆయన మాట్లాడుతూ.. బాగ్దాదీ మరణాన్ని ధ్రువీకరించారు. బాగ్దాదీ తనంతట తాను పేల్చుకుని మరణించాడని తెలిపారు.

" శనివారం రాత్రి ప్రపంచంలో అతిపెద్ద ఉగ్రసంస్థకు అధిపతి అయిన వ్యక్తిని అమెరికా అంతమొందించింది. అబుబకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడు. ప్రపంచంలోనే అత్యంత కిరాతక ఉగ్రవాద సంస్థ అయిన ఐసిస్‌కు ఇతడు అధిపతి. వాయువ్య సిరియాలో శనివారం రాత్రి అమెరికాకు చెందిన ప్రత్యేక ఆపరేషన్​ దళం అత్యంత ప్రమాదకరమైన,సాహసోపేతమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. బాగ్దాదీతో పాటు అతడి సహచరులు, స్నేహితులు మృత్యువాతపడ్డారు. ఓ వైపు మూసుకుపోయిన సొరంగంలో ఏడ్చుకుంటూ, పరుగులు పెడుతూ వెళ్లిన బాగ్దాదీ ఆ సొరంగం చివర చనిపోయాడు. తన కుమారులైన ముగ్గురిని తనతోపాటు ఆ సొరంగంలోకి తీసుకెళ్లి వాళ్ల మరణానికి కూడా కారణం అయ్యాడు. అతడు సొరంగంలో చివరికి వెళ్లేసరికి అతడిని మా సైనిక శునకాలు గుర్తించాయి. ఇక తప్పించుకునే దారిలేదని తెలుసుకున్న బాగ్దాదీ తనను తాను పేల్చుకొని తనతో పాటు తన ముగ్గురు పిల్లల్ని కూడా పేల్చివేశాడు. పేలుడు ధాటికి బగ్దాదీ శరీరం తునాతునకలైంది. ఆ తర్వాత జరిపిన వివిధ పరీక్షల ద్వారా ఛిద్రమైన ఆ శరీరం బగ్దాదీగా గుర్తించడం జరిగింది. "

                                       -డొనాల్డ్​ ట్రంప్​, అమెరికా అధ్యక్షుడు
 
19:25 October 27

సిరియాకు వాయువ్యాన జరిపిన దాడిలో హతం

ప్రపంచానికి ముప్పుగా పరిణమించిన ఉగ్ర సంస్థ ఐసిస్‌కు అధినేతగా వ్యవహరిస్తున్న అబూబకర్‌ అల్‌ బగ్దాదీని.. అంతమొందించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ధ్రువీకరించారు. సిరియాకు వాయువ్యాన అమెరికా సైన్యం జరిపిన వైమానికదాడిలో బాగ్దాదీ హతమయ్యాడని... శ్వేతసౌధంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ట్రంప్ వె‌ల్లడించారు. ఉగ్ర మూకలపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఐసిస్‌ వ్యవస్థాపక నేత అయిన బగ్దాదీ కోసం గత కొన్నేళ్లుగా అమెరికా గాలిస్తుందని.. బగ్దాదీని పట్టుకోవడం లేదా చంపడం తన ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముందు వరుసలో ఉంటుందని ట్రంప్‌ అన్నారు. 

19:13 October 27

ధ్రువీకరించిన ట్రంప్​

  • ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్ బాగ్దాదీ మృతిని ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు
  • అమెరికా సైనికదాడుల సమయంలో బాగ్దాదీ ఆత్మాహుతి చేసుకున్నాడు: ట్రంప్‌
  • తన ముగ్గురు పిల్లలను చంపి ఆత్మాహుతి చేసుకున్నాడు: డొనాల్డ్‌ ట్రంప్‌
  • ప్రపంచాన్ని భయపెట్టాలని చూసిన బాగ్దాదీ భయంతో పిరికిపందలా చనిపోయాడు: ట్రంప్‌

19:06 October 27

ఐసిస్​ అధినేత అబు బకర్​ అల్​ బాగ్దాదీ హతం..

అమెరికా సైనికదాడిలో ఐసిస్ అధినేత బాగ్దాదీ హతమయ్యాడని యూఎస్​ ప్రకటించింది. బాగ్దాదీ మరణాన్ని స్వయంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ ధ్రువీకరించారు.

13:06 October 27

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్​ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఈ దాడిలో బాగ్దాదీ హతమయ్యాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

కొద్దిగంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఓ ట్వీట్ చేశారు. భారీ ఘటన ఒకటి జరిగిందని అన్నారు. కాసేపటికే బాగ్దాదీ లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలిసింది. 

ఆపరేషన్​ సిరియా...

సిరియాలోని ఇడ్లిబ్​ రాష్ట్రంలో బాగ్దాదీ లక్ష్యంగా దాడి జరిగినట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే బాగ్దాదీ చనిపోయాడా లేదా అనే అంశంపై అధికారిక సమాచారం రావాల్సి ఉందని చెప్పాయి.

హెలికాప్టర్​ నుంచి...!

సిరియా ఇడ్లిబ్ రాష్ట్రం బరీష గ్రామంలో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టినట్లు బ్రిటన్​కు చెందిన 'సిరియన్​ అబ్జర్వేటరీ ఫర్​ హ్యూమన్​ రైట్స్​' సంస్థ వెల్లడించింది. హెలికాప్టర్​ నుంచి ఓ ఇంటిని, కారును లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో 9 మంది ఐఎస్​ ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. అయితే... చనిపోయిన వారిలో ఐఎస్​ అగ్రనేత బాగ్దాదీ ఉన్నాడా లేడా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. 

ట్రంప్​ ఈ అంశంపై భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30గంటలకు ప్రకటన చేస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి తెలిపారు.
 
12:03 October 27

హెలికాప్టర్​ నుంచి దాడి....

సిరియా ఇడ్లిబ్ రాష్ట్రం బరీష గ్రామంలో భద్రతా బలగాలు ప్రత్యేక ఆపరేషన్​ చేపట్టినట్లు బ్రిటన్​కు చెందిన 'సిరియన్​ అబ్జర్వేటరీ ఫర్​ హ్యూమన్​ రైట్స్​' సంస్థ వెల్లడించింది. హెలికాప్టర్​ నుంచి ఓ ఇంటిని, కారును లక్ష్యంగా చేసుకుని జరిపిన కాల్పుల్లో 9 మంది ఐఎస్​ ఉగ్రవాదులు మరణించినట్లు తెలిపింది. అయితే... చనిపోయిన వారిలో ఐఎస్​ అగ్రనేత బాగ్దాదీ ఉన్నాడా లేడా అన్న అంశంపై స్పష్టత ఇవ్వలేదు. 

11:41 October 27

బాగ్దాదీ హతమైనట్లు ఇరాన్​కు సమాచారం

బాగ్దాదీ హతమయ్యాడన్న వార్తలు నిజమని తెలుస్తోంది. ఐఎస్​ ఉగ్రసంస్థ అగ్రనేతను మట్టుబెట్టినట్లు తమకు సమాచారం అందిందని ఇరాన్​ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

10:35 October 27

బాగ్దాదీ వ్యవహారంపై సాయంత్రం ట్రంప్ ప్రకటన

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్​ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఈ దాడిలో బాగ్దాదీ హతమయ్యాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 కొద్దిగంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఓ ట్వీట్ చేశారు. భారీ ఘటన ఒకటి జరిగిందని అన్నారు. కాసేపటికే బాగ్దాదీ లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలిసింది. 

ఆపరేషన్​ సిరియా...

సిరియాలోని ఇడ్లిబ్​ రాష్ట్రంలో బాగ్దాదీ లక్ష్యంగా దాడి జరిగినట్లు అమెరికా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. అయితే బాగ్దాదీ చనిపోయాడా లేదా అనే అంశంపై అధికారిక సమాచారం రావాల్సి ఉందని చెప్పాయి.

ట్రంప్​ ఈ అంశంపై భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6.30గంటలకు ప్రకటన చేస్తారని శ్వేతసౌధం అధికార ప్రతినిధి తెలిపారు.

09:45 October 27

ఐఎస్​ అగ్రనేత అబు బకర్​ అల్​ బాగ్దాదీ హతం

ఇస్లామిక్​ స్టేట్​ ఉగ్రవాద సంస్థ అగ్రనేత అబు బకర్ అల్​ బాగ్దాదీ లక్ష్యంగా అమెరికా భారీ ఆపరేషన్​ చేపట్టింది. ఈ దాడిలో బాగ్దాదీ హతమయ్యాడా లేదా అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

 కొద్దిగంటల క్రితమే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్​ ఓ ట్వీట్ చేశారు. భారీ ఘటన ఒకటి జరిగిందని అన్నారు. కాసేపటికే బాగ్దాదీ లక్ష్యంగా దాడి జరిగినట్లు తెలిసింది. 

Last Updated : Oct 27, 2019, 9:24 PM IST

ABOUT THE AUTHOR

...view details