అమెరికా చట్టసభల్లో ఆధిపత్యానికి ఇరు పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. అధ్యక్ష ఎన్నికల్లోని అనిశ్చితే ఇక్కడా కనిపిస్తోంది. అధ్యక్ష ఎన్నికలతో పాటు ఎగువసభ అయిన సెనేట్, దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్(ప్రతినిధుల సభ)కు ఎన్నికలు జరిగాయి.
ఇదీ చదవండి:కోర్టుకెక్కిన ట్రంప్- కౌంటింగ్ నిలిపివేయాలని డిమాండ్!
ఇంతవరకు ఎగువసభలో రిపబ్లికన్లకు, దిగువసభలో డెమొక్రాట్లకు ఆధిక్యం ఉండగా.. ప్రస్తుతం తుది ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సెనేట్‌లో రిపబ్లికన్లకు 53, డెమొక్రాట్లకు 47 స్థానాలు ఉండగా.. ఇద్దరు స్వతంత్ర సభ్యులున్నారు. ఈ ఎన్నికల్లో 35 స్థానాలకు ఓటింగ్ జరిగింది. ఇందులో 23 రిపబ్లికన్ల స్థానాలు కాగా, 12 డెమొక్రాట్లవి.