భారత్లో కొవిడ్ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదవటం.. హృదయవిదారకమని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అన్నారు. కరోనా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఇప్పటికే భారత్కు ఆక్సిజన్ సిలిండర్లు, అత్యవసర వైద్య సామగ్రిని పంపించామన్నారు.
భారత్తో పాటు ఇతర దేశాలకు కొవిడ్ వ్యాక్సిన్లు అందించేందుకు మేధో హక్కులను తొలగించేందుకు తాము మద్దతిచ్చామన్నారు కమల. మహమ్మారి ప్రారంభ దశలో అమెరికాకు భారత్ సహకరించిందని గుర్తు చేసుకున్నారు.
మూలాలు భారత్లోనే..
తన వంశం మూలాలు భారత్లోనే ఉన్నాయని కమల అన్నారు. తన తల్లి భారత్లోనే పుట్టి, పెరిగారని తెలిపారు.. అమెరికాకు భారత్ సంక్షేమం అత్యంత ముఖ్యమన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో భారత్కు సాయ పడేందుకు బైడెన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.