సాధారణంగా శీతల దేశాల్లో.. ముఖ్యంగా చలి కాలంలో కొందరిలో కాలి వేళ్లు వాచి ఎర్రగా మారి నొప్పిపెడుతుంటాయి. ఇప్పుడు అమెరికా, స్పెయిన్, బెల్జియం, ఇటలీ తదితర దేశాల్లో అనేక మంది ముఖ్యంగా చిన్నపిల్లలు, యువకులు ఈ సమస్యతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు తీవ్ర చలికాలం కాదు. అలానే ఆయా వ్యక్తుల్లో ఎక్కువమంది గతంలో ఈ సమస్య బారిన పడలేదు. అయినా ఎందుకీ సమస్య పెరుగుతుందనేది వైద్యులకు అంతుపట్టడంలేదు.
ప్రస్తుతం కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో.. ఇలాంటివారికి కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.