తెలంగాణ

telangana

ETV Bharat / international

వృద్ధుడి ప్రాణాలు తీసిన దుండగులు-ఒక డాలర్​తో పరారు - muggers took one dollar from men

అమెరికాలో క్రిస్మస్ ఈవ్​ రోజున జరిగిన దాడిలో తీవ్రంగా గాయపడ్డ వృద్ధుడు.. శనివారం ప్రాణాలు కోల్పోయాడు. డబ్బుల కోసమే ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. డబ్బులివ్వడానికి నిరాకరించడం వల్ల దుండగులు దాడి చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను పోలీసులు విడుదల చేశారు. నిందితుల కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

the-muggers-took-one-us-dollar-from-the-men-and-fled
వృద్ధుడి ప్రాణాలు తీసిన దుండగులు-ఒక డాలర్​తో పరారు

By

Published : Dec 29, 2019, 3:54 PM IST

వృద్ధుడి ప్రాణాలు తీసిన దుండగులు-ఒక డాలర్​తో పరారు

అమెరికాలోని న్యూయార్క్​లో కొంతమంది దుండగులు చేసిన దాడిలో వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. క్రిస్మస్​కు ఒక రోజు ముందు జరిగిన ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ 60ఏళ్ల జువాన్​ ఫ్రెస్నడ.. చికిత్స పొందుతూ మృతిచెందినట్లు పోలీసులు ప్రకటించారు. డబ్బుల కోసమే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడికి సంబంధించి కొన్ని వీడియోలు, ఫొటోలను అధికారులు విడుదల చేశారు.

ఫ్రెస్నడ.. మరో యువకుడితో కలిసి అర్ధరాత్రి 1:30 గంటలకు మోరిసేనియా నగరంలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వారి వద్దకు దుండగులు చేరుకున్నారు. డబ్బులు డిమాండ్ చేశారు. అందుకు నిరాకరించినందున దుండగులు దాడికి పాల్పడ్డారు. అయితే దాడికి గురైన వ్యక్తి ఫ్రెస్నడ.. లేక ఆ యువకుడా? అన్న విషయం ఆ దృశ్యాల్లో స్పష్టంగా లేవు.

అనంతరం వారి నుంచి ఒక డాలర్​ను తీసుకొని దుండగులు పారిపోయినట్లు పోలీసులు స్పష్టం చేశారు. వారి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి:కుప్పకూలిన ఫుట్​బాల్​ క్రీడాకారుల విమానం.. ఐదుగురు మృతి

ABOUT THE AUTHOR

...view details