కొవిడ్-19తో విషమ పరిస్థితుల్లో ఉన్న ఆరుగురికి అమెరికాలో గుండె కణ చికిత్సను ప్రయోగాత్మకంగా అందించారు. వీరిలో నలుగురు కోలుకున్నారు. క్యాప్-1002 అని పిలిచే విధానాన్ని గుండె సమస్యలున్న వారికి, రోగ నిరోధక శక్తి అతిస్పందన కారణంగా తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి అనుసరిస్తారు. ఇందులో మానవ గుండె కణజాలంతో ప్రయోగశాలలో వృద్ధి చేసిన సీడీసీ కణాల (కార్డియోస్పియర్-డిరైవ్డ్ సెల్స్)ను వినియోగిస్తారు. ప్రస్తుత ఫలితాలు ఆశాజనకంగా ఉన్నా కొవిడ్ బాధితులకు ఇది సురక్షితమైన చికిత్సగా చెప్పలేమని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు.
కొవిడ్‌కు తొలిసారి గుండె కణ చికిత్స
కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురైన వారికి తొలిసారి గుండె కణ చికిత్సను ప్రయోగాత్మకంగా అందించారు అమెరికా వైద్యులు. క్యాప్-1002 అని పిలిచే విధానాన్ని గుండె సమస్యలున్న వారికి, రోగ నిరోధక శక్తి.. అతిస్పందన కారణంగా తలెత్తే ఇన్‌ఫ్లమేషన్‌ను తగ్గించడానికి అనుసరిస్తారు. ప్రస్తుత ఫలితాలు ఆశాజనకంగా ఉన్నట్లు తెలిపారు.
కొవిడ్‌కు తొలిసారి గుండె కణ చికిత్స
అమెరికాలోని సెడార్స్-సినాయ్ ఆసుపత్రిలో నిర్వహించిన ఈ చికిత్సల వివరాలు 'బేసిక్ రీసెర్చి ఇన్ కార్డియాలజీ' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కొవిడ్ రోగులకు ఈ తరహా చికిత్సకు అమెరికా ఆహార ఔషధ సంస్థ (ఎఫ్‌డీఏ) అనుమతి లేదు. అయితే ఇతర చికిత్సలేవీ లేనప్పుడు... అత్యవసర పరిస్థితుల్లో ఇలాంటి ప్రయోగాత్మక చికిత్సలు చేయడానికి నిబంధనలు అనుమతిస్తాయి.