అమెరికా-మెక్సికో మధ్య అతిపెద్ద సొరంగాన్ని కనుగొన్నారు అగ్రరాజ్య అధికారులు. మెక్సికో టిజువానాలోని పారిశ్రామిక భవనం నుంచి అమెరికా శాన్ డియాగోకు ఈ రహస్య మార్గం ఉన్నట్లు గుర్తించారు. కిలోమీటరుకన్నా ఎక్కువ పొడవు ఉన్న ఈ సొరంగాన్ని మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కోసమే తవ్వారని తేల్చారు అమెరికా కస్టమ్స్, సరిహద్దు రక్షణ అధికారులు.
అనేక సౌకర్యాలు...
ఈ సొరంగ మార్గం మొత్తం పొడవు 1.3 కిలోమీటర్లు పొడవు. ఐదున్నర అడుగుల ఎత్తు, రెండు అడుగుల వెడల్పుతో భూమికి 70 అడుగుల లోతున ఉంది. ఇందులో సరుకు రవాణా కోసం ప్రత్యేక రైలు మార్గం, వెంటిలేషన్, హైవోల్టేజ్ విద్యుత్ తీగలు, లిఫ్ట్, డ్రైనేజీ వ్యవస్థ ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అక్రమ సొరంగ మార్గానికి సంబంధించి ఇంకెవరినీ అరెస్టు చేయలేదని తెలిపారు.
డ్రగ్స్ దందా కోసం 2 దేశాల మధ్య సొరంగం 2014లో టిజువాన్ నుంచి శాన్ డియాగో మధ్య 904 మీటర్లు పొడవైన సొరంగాన్ని అధికారులు గుర్తించారు.
ఇదీ చూడండి: బాలుడిపై పిట్‌బుల్ ఎటాక్.. ఇంత కోపం ఎందుకు?