మెక్సికో క్రిస్మస్ వేడుకల్లో ఆసక్తికరమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓక్సాకా నగరంలో దశాబ్దాలుగా నిర్వహించే 'నోచే డి రబనోస్' కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. నోచే డి రబనోస్ అంటే నైట్ ఆఫ్ రాడిష్ అని అర్థం. ఇందులో ముల్లంగితో వివిధ రకాల ఆకారాలను వినూత్న రీతిలో తీర్చిదిద్దుతారు కళాకారులు.
నైపుణ్యం ఉన్న కళాకారులందరూ ఇందులో పాల్గొని వారి కళాఖండాలను ప్రదర్శించారు. ముల్లంగితో పలు ప్రసిద్ధి పొందిన పాత్రలు సహా మతపరమైన సన్నివేశాలు ప్రతిబింబించేలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఓక్సాకా నగరంలోని కళాకారులు, స్థానికులకు మధ్య ఐకమత్యాన్ని పెంపొందించడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారి అభిప్రాయం.