తెలంగాణ

telangana

ETV Bharat / international

టెక్సాస్ ఘటన ఉగ్రవాద చర్య: జో బైడెన్ - టెక్సాస్ జో బైడెన్

Texas hostage news: టెక్సాస్​లోని ఓ ప్రార్థనా స్థలంలో పలువురిని బందీలుగా చేసుకొని సాయుధుడు వీరంగం సృష్టించడాన్ని ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఇలాంటి దాడులను ఎదుర్కొనే సామర్థ్యం అమెరికాకు ఉందన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

Texas hostage news
టెక్సాస్ ఘటన ఉగ్రవాద చర్య: జో బైడెన్

By

Published : Jan 17, 2022, 8:43 AM IST

Texas hostage news: జైలులో ఉన్న ఉగ్రవాది విడిచిపెట్టాలంటూ టెక్సాస్​లో ఓ సాయుధుడు వీరంగం సృష్టించడాన్ని తీవ్రంగా ఖండించారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఈ ఘటనను ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఈ విషయంపై అటార్నీ జనరల్​తో మాట్లాడినట్లు తెలిపారు. స్థానిక అధికారులు, ఎఫ్​బీఐ పూర్తి సమన్వయంతో పనిచేస్తున్నారని వెల్లడించారు.

Biden Texas hostage:

"ఎఫ్​బీఐ, ఇతర అధికారులు గొప్పగా పనిచేస్తున్నారు. ఇలాంటి దాడులను ఎదుర్కొనే సామర్థ్యం అమెరికాకు ఉంది. ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించాను. ఈ విషయంలో చర్యలు తీసుకోవడంపై అటార్నీ జనరల్ దృష్టిసారించారు."

-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు

ఇదీ జరిగింది!

Texas synagogue hostage: డాలస్​కు కొద్ది దూరంలో ఉన్న కోలీవిల్‌ పట్టణంలోని 'సినగాగ్‌'గా పిలిచే యూదుల ప్రార్థనా మందిరంలోకి ఓ సాయుధుడు శనివారం ఉదయం 10:30 (అమెరికా కాలమానం ప్రకారం) గంటల సమయంలో చొరబడ్డాడు. అందులో ఉన్న 'రబ్బీ'గా పిలిచే మతగురువు సహా నలుగురు వ్యక్తుల్ని బందీలుగా చేసుకున్నాడు. తర్వాత ఓ వీడియోను బయటకు వదిలాడు. అమెరికా జైల్లో ఉన్న ఓ పాకిస్థాన్‌ ఉగ్రవాది ఆఫియా సిద్ధిఖీని వదిలిపెట్టాలని ముష్కరుడు అందులో డిమాండ్‌ చేసినట్లు కోలీవిల్‌ పోలీసు వర్గాలు తెలిపాయి. అప్పటికే అక్కడికి చేరుకున్న ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) ప్రత్యేక దళాలైన స్వాట్‌ టీం.. కోలీవిల్‌ పోలీసులతో కలిసి పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ వచ్చింది. దుండగుడితో మాట్లాడి బందీలను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేపట్టింది. ఈ క్రమంలో ముష్కరుడితో ప్రత్యేక దళాలు చర్చలు కొనసాగించాయి.

ఈ క్రమంలో ఒక బందీని దుండగుడు శనివారం సాయంత్రం 5 గంటల సమయంలో సురక్షితంగా వదిలిపెట్టాడు. స్థానిక పోలీసులు, అమెరికా ప్రత్యేక దళాలు దుండగుడిని హతమార్చడం వల్ల ఎట్టకేలకు పరిస్థితి సుఖాంతం అయ్యింది. చివరకు శనివారం రాత్రి 9:30 గంటలకు అందరూ క్షేమంగా బయటపడ్డారు.

Texas synagogue suspect name

దుండగుడిని మాలిక్ ఫైజల్ అక్రమ్(44)​గా ఎఫ్​బీఐ గుర్తించింది. అతడు బ్రిటన్ జాతీయుడని తెలిపింది. ఈ ఘటనపై ఎవిడెన్స్ రెస్పాన్స్ టీమ్ మరిన్ని ఆధారాలు సేకరిస్తోందని వెల్లడించింది. మరో ఇద్దరిని ఈ వ్యవహారంలో అదుపులోకి తీసుకున్నట్లు స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:తాలిబన్ల దుశ్చర్య.. సంగీతకారుడి వాయిద్యాన్ని కాల్చి..

ABOUT THE AUTHOR

...view details