అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో మంచు తుపాను కారణంగా చనిపోయినవారి సంఖ్య పెరుగుతోంది. ఫిబ్రవరి నుంచి ఇప్పటివరకు 111 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. వారిలో ఎక్కువ మంది అత్యల్ప ఉష్ణోగ్రత వల్లే మృతి చెందారని ఆ రాష్ట్ర ఆరోగ్య విభాగం తెలిపింది. మరణాల సంఖ్య ఇంకా పెరగొచ్చని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.
టెక్సాస్‌లో 100 దాటిన మంచు తుపాను మృతులు
అమెరికాలో మంచు తుపాను వల్ల మరణించినవారి సంఖ్య 100 దాటినట్లు అక్కడి అధికారులు తెలిపారు. తుపానుకు తోడు, అత్యల్ప ఊష్టోగ్రతల వల్ల మృతులు మరింత పెరగొచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
టెక్సాస్‌లో 100 దాటిన మంచు తుపాను మృతులు
తుపాను కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయి దాదాపు 40 లక్షల మంది అంధకారంలో ఉన్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతల వల్ల.. పైపులైన్లలో నీరు గడ్డకట్టుకుపోయింది. తాగునీరు అందక లక్షలాది మంది ఇబ్బంది పడుతున్నారు.