తెలంగాణ

telangana

ఫైజర్​ టీకా ప్రయోగం ఇలా సాగింది!

By

Published : Nov 10, 2020, 1:38 PM IST

ప్రపంచదేశాలు కరోనా వ్యాక్సిన్​ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నాయి. ఈ క్రమంలో తమ వ్యాక్సిన్​ 90శాతం సమర్థంగా పని చేస్తుందని అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా సంస్థ ఫైజర్ ప్రకటించింది. అయితే దీనిపై పరిశోధన ఏ విధంగా సాగింది? టీకా సమర్థంగా పని చేస్తుందని సంస్థ ఎలా చెబుతోంది?

Testing timeline: What's ahead for COVID-19 vaccines
ఫైజర్​ టీకా చివర దశ ప్రయోగం ఎలా జరిగింది?

ప్రపంచంలో ఇప్పటికే చాలా వ్యాక్సిన్‌లు తుది దశ ప్రయోగాల్లో ఉండగా.. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో సంయుక్తంగా ప్రముఖ అమెరికా ఫార్మా సంస్థ ఫైజర్​.. కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. తాము తయారు చేసిన వ్యాక్సిన్​ 90శాతం సమర్థంగా పనిచేస్తుందని ఫైజర్​ ప్రకటించింది. అమెరికా ఎన్నికల్లో కీలకంగా మారిన ఈ వ్యాక్సిన్​ ప్రయోగం ఏ విధంగా జరిగిందో తెలుసుకుందాం.

బయోఎన్​టెక్​తో సంయుక్తంగా..

జర్మనీకి చెందిన బయోఎన్​టెక్​తో సంయుక్తంగా వ్యాక్సిన్​పై పరిశోధన జరిపింది ఫైజర్​. వ్యాక్సిన్​ తుదిదశ ప్రయోగం కోసం 44,000 మందిని ఎంపిక చేశారు. అయితే వారిలో కొంతమందికి డమ్మీ టీకా ఇచ్చారు. మరికొంతమందికి ఫైజర్ వ్యాక్సిన్​ ఇచ్చారు​ శాస్త్రవేత్తలు.

మొదటి డోసు ఇచ్చిన మూడు వారాల అనంతరం రెండో డోసు ఇచ్చారు. రెండో డోసు ఇచ్చిన మరో వారం తర్వాత ఫలితాలను సమీక్షించారు. టీకా ప్రయోగించిన వారి దిన చర్యను గమనించి.. ఎవరు ఎక్కువగా కొవిడ్​ లక్షణాలతో బాధపడుతున్నారో నిర్ధరిస్తారు.

ఏం జరిగింది..?

ప్రతి వ్యాక్సిన్​ అధ్యయనాన్ని డేటా, భద్రత పర్యవేక్షణ బోర్డు(డీఎస్​ఎంబీ) స్వతంత్రగా పర్యవేక్షిస్తుంది. ఈ బోర్డులో టీకా తయారీదారులతో ఎలాంటి సంబంధాలు లేని శాస్త్రవేత్తలు, గణాంకవేత్తలు సభ్యులుగా ఉంటారు.

ఒక టీకా అధ్యయనం పూర్తయ్యే ముందు అసలైన టీకాను ఎవరికి ఇచ్చారు. డమ్మీ వ్యాక్సిన్​ ఎవరికి ఇచ్చారనే కోడ్‌ను అన్‌లాక్​ చేసే అధికారం డీసీఎంబీకి మాత్రమే ఉంటుంది. ప్రారంభించిన పరీక్షలను ఆపడానికి, టీకా సమర్థంగా పని చేస్తుందో? లేదో సిఫార్సు చేసే అధికారం కూడా ఆ బోర్డుకే ఉంటుంది.

ఎఫ్​డీఏ అంగీకారానికి ముందు టీకా తయారీదారుల నుంచి ఓ నివేదికను బోర్డు కోరుతుంది. అలా సమర్పించిన నివేదకిలో టీకా ప్రయోగానికి సంబంధించిన అన్ని విషయాలను వెల్లడించింది ఫైజర్.

టీకా ఇచ్చిన వారిలో 94 మందికి కరోనా ఉండగా.. వారిపై 90 శాతం ప్రభావవంతంగా పని చేసిందని పేర్కొంది ఫైజర్​. కానీ ఈ పరిశోధన ఇంతటితో ఆగిపోదని స్పష్టం చేసింది సంస్థ. భద్రత కోసం మరింత సమర్థంగా వ్యాక్సిన్​పై పరిశోధన నిర్వహిస్తామని తెలిపింది.

ముందుగానే ఊహించారా?

ప్రాథమికంగా 32 మందిపైనే వ్యాక్సిన్​ దుష్ప్రభావం చూపినట్లు ఫైజర్​ నిర్ధరించింది. అయితే కోట్లాది మందికి ఇవ్వాల్సిన వ్యాక్సిన్​ను నిశితంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని పలువురు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.

దీంతో వ్యాక్సిన్​ ప్రయోగంపై పునఃపరిశీలన చేయాలని.. ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాలంటూ తిరిగి ఎఫ్​డీఏ అనుమతిని కోరింది ఫైజర్. ఎక్కువ కేసులు వచ్చినప్పుడు టీకా మధ్యంతర విశ్లేషణ చేయమని చెప్పారు. ఆ సమయంలో 94మంది ఇన్​ఫెక్షన్ల బారిన పడినట్లు తేలింది. దీంతో డీఎస్​ఎంబీ ముందు టీకా గురించి విశ్లేషించడానికి ఉపయోగపడింది. అయితే ఈ విషయాన్ని ఫైజర్​ ముందుగానే ఊహించినట్లు తెలుస్తోంది.

భద్రత సంగతేంటి?

భద్రతకే తొలి ప్రాధాన్యత ఇచ్చినట్ల ఫైజర్​ తెలిపింది. తీవ్ర దుష్ప్రభావాలను పర్వవేక్షకులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇతర వ్యాక్సిన్ ప్రయోగాల్లో కొన్ని భద్రత సమస్యల తలెత్తి జాప్యం జరిగింది. అయితే తమ టీకాతో ఇప్పటి వరకు ఎటువంటి భద్రత సమస్యలు తలెత్తలేదని ఫైజర్ పేర్కొంది. కానీ వలంటీర్లను కనీసం రెండు నెలల పాటు నిశితంగా పరిశీలించిన తర్వాత వారి వ్యాక్సిన్​ను సమీక్షించాలని టీకా సంస్థలకు ఎఫ్​డీఏ సూచించింది.

ఇతర సంస్థ టీకాల్లో దుష్ప్రభావాలు పెరుగుతున్న నేపథ్యంలో నవంబరు నాటికి తమ వ్యాక్సిన్​ అందుబాటులోకి తీసుకురావాలని ఫైజర్​, మోడెర్నా సంస్థలు భావిస్తున్నాయి.

చివరకు చెప్పేది ఏంటంటే..?

తాము తయారు చేసిన టీకాపై అధ్యయనం పూర్తి కాకుండానే అత్యవసర ప్రాతిపదికన' వినియోగించేందుకు అనుమతిని కోరాయి టీకా తయారీ సంస్థలు. అయితే టీకా సంస్థలు నిర్వహించిన ప్రయోగాలు, అధ్యయనాలపై ఎఫ్​డీఏ శాస్త్రవేత్తల బృందం చర్చిస్తుంది.

ఇప్పటికే వ్యాక్సిన్​ డోసుల నిల్వ చేయడం ప్రారంభించాయి టీకా సంస్థలు. ఒకవేళ టీకాకు అనుమతి లభిస్తే.. తొలి డోసు తక్కువ స్థాయిలో సరఫరా చేస్తారు. ఎందుకంటే పరిశోధనలో కంటే ఎక్కువ మందికి టీకా ఇచ్చినప్పుడు ఇన్​ఫెక్షన్ల బారిన పడేవారి సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. టీకాలు వేసిన తొలి వ్యక్తులను పరీక్షించాల్సి ఉంటుంది.

ఇదీ చూడండి:'చైనా టీకాతో డేంజర్​- ట్రయల్స్​కు బ్రేక్'

ABOUT THE AUTHOR

...view details