తెలంగాణ

telangana

ETV Bharat / international

Elon Musk: ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నా.. ఏమంటారు?: మస్క్​ - ఎలాన్ మస్క్ ట్యాక్స్ ట్వీట్

Tesla Elon Musk: అపర కుబేరుడు, స్పేస్​ఎక్స్ సంస్థ అధినేత ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నారా? ఇకపై పూర్తిస్థాయి ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారాలనుకుంటున్నారా? అంటే మస్క్​ నుంచి అవుననే సమాధానం వస్తోంది. అయితే సరైన నిర్ణయం తీసుకునేందుకు మరికాస్త సమయం పట్టనుంది.

elon musk Tesla
ఎలాన్ మస్క్

By

Published : Dec 10, 2021, 10:52 PM IST

Tesla Elon Musk Tweet: టెస్లా చీఫ్‌ ఎలాన్‌ మస్క్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఉద్యోగం మానేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ ట్వీట్‌ చేశారు. 'నేను ఉద్యోగం వదిలేయాలనుకుంటున్నాను. పూర్తిస్థాయిలో ఇన్‌ఫ్లూయన్సర్‌గా మారాలనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు' అని ట్వీట్‌లో పేర్కొన్నారు. నిజంగానే ఉద్యోగానికి గుడ్‌బై చెప్పే ఆలోచనలో ఉన్నారా..? అన్న విషయంపై అతని ఫాలోవర్లలో గందరగోళం నెలకొంది. మస్క్‌ తరచూ సోషల్‌ మీడియాను ప్రచారం కోసం, వదంతుల వ్యాప్తికి వాడుకొంటారు. జనవరిలో జరిగిన కంపెనీ కాన్ఫరెన్స్‌ కాల్‌లో మాత్రం మరికొన్ని సంవత్సరాలు టెస్లా సీఈవోగా కొనసాగుతానని ఆశిస్తున్నట్లు మస్క్‌ పేర్కొనడం గమనార్హం.

Elon Musk Tax Tweet: గత నెల పన్ను చెల్లింపు కోసం పదిశాతం షేర్లు విక్రయించాలా.. వద్దా అన్న అంశంపై మస్క్‌ ట్విట్టర్‌ పోల్‌ నిర్వహించారు. దీనిలో ఆయన ఫాలోవర్లు షేర్ల విక్రయానికే ఓటు వేశారు. దీనికి తోడు ఈ పోల్‌ పెట్టడానికి ముందే మస్క్‌ సోదరుడు కింబల్‌ టెస్లాలోని వాటాలను విక్రయించినట్లు వార్తలు వచ్చాయి. ట్విటర్‌లో వాగ్దానం చేసిన విధంగానే దాదాపు 9,00,000 టెస్లా షేర్లను కంపెనీ సీఈఓ ఎలాన్‌ మస్క్‌ విక్రయించారు. అమెరికా సెక్‌ వద్ద లభించిన వివరాల ప్రకారం.. వీటి విలువ 1.1 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.8250 కోట్లు)గా ఉంది. దీంతో టెస్లా షేర్ల ధర పతనమై 50 బిలియన్‌ డాలర్లు నష్టం వచ్చింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details