తెలంగాణ

telangana

ETV Bharat / international

'ఉగ్రవాదులకు ఆసరాగా కరోనా సంక్షోభ పరిస్థితులు' - Antonio guterres updates

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచంలో పెరిగిపోతున్న ఉగ్రవాదానికి అడ్డుకట్ట వేయాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​ పిలుపునిచ్చారు. సాంకేతికతతో పాటు వైరస్​ వ్యాప్తిని కూడా ఉగ్రవాదులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు​.

Terror groups must not be allowed to use fragilities caused by COVID-19: UN chief
ఉగ్రవాదులకు ఆసరాగా కరోనా సంక్షోభ పరిస్థితులు

By

Published : Jul 7, 2020, 5:19 AM IST

కరోనా మహమ్మారి కారణంగా తలెత్తిన సంక్షోభాన్ని ఉగ్రవాద సంస్థలు ఉపయోగించుకునేందుకు అవకాశం ఇవ్వకూడదని ఐక్యరాజ్యసమితి ఉద్ఘాటించింది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో ఇస్లామిక్​ స్టేట్​, అల్​ఖైదా, వాటి ప్రాంతీయ అనుబంధ సంస్థలకు సంబంధించిన సమూహాలను అనుమతించకూడదని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్​ స్పష్టం చేశారు.

కొవిడ్​-19 సంక్షోభం..

'వర్చువల్​ కౌంటర్​ టెర్రరిజం వీక్' ప్రారంభోత్సవంలో పాల్గొన్న గుటెర్రస్​.. ఇరాక్​, సిరియా దేశాలలో ఇస్లామిక్ స్టేట్​ ఉగ్రవాదులు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని పునరుద్ఘాటించారు. డిజిటల్​ సాంకేతికత, సైబర్​ దాడులు​, బయో టెర్రరిజంతో పాటు కొవిడ్​ వ్యాప్తి కూడా ఉగ్రవాదులకు వరంగా మారిందని అందోళన వ్యక్తం చేశారు.

'ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో కొవిడ్​ పరిస్థితులను అంచనా వేయడం తొందరపాటు చర్యే అవుతుంది. కానీ ఈలోగా ఇస్లామిక్ స్టేట్​, అల్​ఖైదా, వాటి ప్రాంతీయ అనుబంధ సంస్థలు అక్కడ తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తున్నాయి. వైరస్ ​తరహాలోనే ఉగ్రవాదం కూడా అన్ని దేశాలపై ప్రభావం చూపుతుంది. అయితే సమష్టిగా పోరాడుతూ, ఆచరణాత్మక పరిష్కార మార్గాలను కనుక్కోవాలి.'

- ఆంటోనియో గుటెర్రస్​, ఐరాస ప్రధాన కార్యదర్శి

వినూత్నంగా ప్రతిస్పందిస్తేనే..

ఈ సమావేశాల్లో చర్చించే అంశాలు, తీసుకునే నిర్ణయాలు రానున్న ఏడాది హై లెవల్​ కౌంటర్​ 7వ ద్వివార్షిక సమీక్షకు తోడ్పాటునందిస్తాయని గుటెర్రస్​ అభిప్రాయపడ్డారు. ఉగ్రవాద ధోరణులను అన్ని దేశాలు నిశితంగా పరిశీలించాలని సూచించిన ఆయన​.. వారిపై వినూత్నంగా ప్రతిస్పందించాలని కోరారు. కొవిడ్​-19 భద్రతా చర్యల్లో భాగంగా ఐరాస​ సభ్యదేశాలు తమ అనుభవాలను పంచుకొని.. సమాచార భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు​.

ఇదీ చదవండి:'మాస్క్ ధరించడం​ తప్పనిసరిపై ఆదేశాలు ఇవ్వలేం'

ABOUT THE AUTHOR

...view details