తెలంగాణ

telangana

ETV Bharat / international

విద్యార్థుల విడుదలకు భారత దౌత్యయత్నాలు - విద్యార్థి వీసా దుర్వినియోగం కేసు

అమెరికాలో విద్యార్థి వీసా దుర్వినియోగం కేసులో అరెస్టయిన విద్యార్థులను విడిపించేందుకు ప్రయత్నిస్తుంది భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.

విద్యార్థుల విడుదలకు భారత దౌత్యయత్నాలు

By

Published : Feb 2, 2019, 8:53 PM IST

విద్యార్థి వీసా దుర్వినియోగం కేసులో అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు అరెస్ట్ చేసిన విద్యార్థులకు సాయం అందించేందుకు భారత్​ దౌత్య ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విద్యార్థుల నిర్బంధంపై ఆందోళ వ్యక్తం చేసింది. వారికి తక్షణ దౌత్య సహకారం అందించేందుకు ప్రయత్నిస్తోంది.

అమెరికా రక్షణ విభాగం 'సివిల్​ ఇమ్మిగ్రేషన్' ఆరోపణలతో భారత విద్యార్థుల్ని నిర్బంధించడం, తదనంతర పరిణామాలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పరిశీలిస్తోంది. విద్యార్థుల పూర్తి వివరాలను, తాజా సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే భారత సంస్థలు, దౌత్య అధికారులు అమెరికాలోని వివిధ నిర్బంధకేంద్రాలకు చేరుకొని విద్యార్థుల విడుదలకు పోలీసులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటి వరకు 30 మంది విద్యార్థులను కలుసుకున్నారు. మిగతా విద్యార్థులకు సైతం సహాయం అందించేందుకు వాషింగ్టన్​లో 24/7 గంటల హెల్ప్​లైన్​ ఏర్పాటు చేశారు.

హెల్ప్​లైన్​ నెంబర్లు: +1-202-322-1190
+1-202-340-2590
email: cons3.washington@mea.gov.in.

'పే అండ్ స్టే రాకెట్'​లో చిక్కుకొని ఇబ్బందుల్లో ఉన్న మరో 6 వందల మంది విద్యార్థులకు సాయం అందించేందుకు ఓ నోడల్ అధికారినీ నియమించినట్లు భారత రాయబార కార్యాలయం వెల్లడించింది.

ఏం జరిగిందంటే....

విద్యార్థి వీసాపై అక్రమంగా అమెరికాకు వస్తున్న వారిని అరికట్టేందుకు పోలీసులు నిర్ణయించారు. ఫార్మింగ్టన్​ విశ్వవిద్యాలయం అనే నకిలీ విశ్వవిద్యాలయ వెబ్​సైట్​ను సృష్టించి ఇమిగ్రేషన్​ మోసాలకు పాల్పడుతున్న విద్యార్థులను అరెస్టు చేశారు.

మొత్తం 130 మంది విదేశీ విద్యార్థులను అరెస్టు చేయగా అందులో 129 మంది భారతీయులే ఉండటం గమనార్హం. వీరిని సివిల్​ ఇమిగ్రేషన్​ ఆరోపణలతో అరెస్ట్​ చేయడం వల్ల F-1 వీసాతో డిగ్రీ పూర్తి చేస్తూనే పనిచేసుకోవచ్చనే అమెరికాకు వెళ్లిన వారి ఆశలు ఆవిరయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details