అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్.. తన సోదరుడు మార్క్‌తో కలిసి జులై 20న అంతరిక్ష యాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. సొంత సంస్థ అయిన 'బ్లూ ఆరిజన్' తొలిసారి చేపట్టబోయే.. మానవ సహిత రోదసి యాత్రలో ఆయన పాలుపంచుకోనున్నారు. అయితే.. ఈ యాత్రపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వేలాది మంది ఏకమై.. బెజోస్ మళ్లీ భూమికి తిరిగి రాకూడదని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం రూపొందించిన ఆన్లైన్ పిటిషన్లో పెద్దఎత్తున తమ సంతకాలతో మద్దతు తెలుపుతున్నారు.
ఈ యాత్రకు సంబంధించి అనేక పిటిషన్లు ఉన్నప్పటికీ.. అందులో జెఫ్ బెజోస్ మళ్లీ భూమి పైకి రాకూడదనే దానిపై ఎక్కువ మంది సంతకాలు చేశారు. ఆదివారం నాటికి ఆ పిటిషన్‌పై 33,000 సంతకాలు నమోదయ్యాయి. 'బిలియనీర్లు ఉండకూడదు' అనే అంశాన్ని ఆ పిటిషన్లో ప్రధానంగా ప్రస్తావించారు.
సీల్డ్ బిడ్డింగ్ పద్ధతిలో..