తెలంగాణ

telangana

ETV Bharat / international

వంతెనను ఢీ కొట్టి బస్సు బోల్తా- 10 మంది మృతి - క్యూబా అధ్యక్షుడు మిగ్యువెల్​ దియాజ్​-కానెల్

క్యూబాలో వంతెనను ఢీ కొట్టి బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 25 మందికి గాయాలవ్వగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

Cuba Bus accident
క్యూబాలో బస్సు బోల్తా- పదిమంది దుర్మరణం

By

Published : Jan 31, 2021, 10:57 AM IST

క్యూబాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వంతెనను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

హవానాకు పశ్చిమావన 40 కిలోమీటర్ల దూరంలో ఈ దుర్ఘటన జరిగిందని క్యూబా జాతీయ రహదారి భద్రతా కమిషన్​ వెల్లడించింది. క్యూబా​ రాజధానిలోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు.. తూర్పు రాష్ట్రమైన గ్రాన్మాకు తిరిగి వెళ్తుండగా.. బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవటం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలిపారు. వంతెనను ఢీ కొట్టి బస్సు బోల్తా పడిందని పేర్కొన్నారు.

ఈ ఘటనలో గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.

అధ్యక్షుడి సంతాపం..

ఈ ఘటనపై క్యూబా అధ్యక్షుడు మిగ్యువెల్​ దియాజ్​-కానెల్​ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతి చెందిన కుటుంబ సభ్యులకు సంతాపం ప్రకటించారు.

ఇదీ చదవండి:పార్కులో అగ్ని ప్రమాదం- తప్పిన ప్రాణాపాయం

ABOUT THE AUTHOR

...view details