అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మద్దతుగా అధ్యక్ష ఎన్నికలను రద్దు చేయాలని కోరుతూ వారాంతపు ర్యాలీ కోసం శనివారం వేలాది మంది వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. రోడ్లపైకి చేరుకుని అధ్యక్షుడికి అనుకూలంగా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో ట్రంప్ అనుకూల, వ్యతిరేక ఆందోళనకారుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణలకు దారితీసింది. ఈ ఘటనలో నలుగురు కత్తి గాట్లతో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. 23 మందిని అరెస్ట్ చేసినట్లు మెట్రోపోలిటన్ పోలీస్ విభాగం తెలిపింది.
అమెరికా తదుపరి అధ్యక్షుడిగా జో బైడెన్‌ను అధికారికంగా ఎన్నుకునేందుకు సోమవారం ఎలక్టోరల్ కాలేజీ సమావేశం కానుంది. ఈ నేపథ్యంలో తమ ఆందోళనలను ఉద్ధృతం చేశారు ట్రంప్ మద్దతుదారులు. వేలాదిగా తరలివచ్చి నిరసనల్లో పాల్గొన్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తన మద్దతుదారులను ఉద్దేశించి ట్వీట్ చేశారు ట్రంప్. 'మేక్ అమెరికా గ్రేట్ అగేయిన్' అనే హాష్‌ట్యాగ్‌ను జతచేశారు