తెలంగాణ

telangana

ETV Bharat / international

రికార్డు​ స్థాయిలో నమోదైన భూమి సగటు ఉష్ణోగ్రత - high heat news

వాతావరణ కాలుష్యం, ఇతర కారణాలతో భూమండలం అగ్నికణికలా మండిపోతోంది. ఈ ఏడాది మే నెలలో భూమి సగటు ఉష్ణోగ్రతలు గత శతాబ్దిలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రతను అధిగమించినట్లు అమెరికాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్తలు నివేదించారు.

Earth ties record high heat May reading
అగ్నిగోళంలా భూమండలం

By

Published : Jun 13, 2020, 10:44 AM IST

భూమి సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు అమెరికా వాతావరణ శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది మే నెలలో నమోదైన ప్రపంచ సగటు ఉష్ణోగ్రత.. గత శతాబ్దిలో రికార్డైన అత్యధిక ఉష్ణోగ్రతను అధిగమించిందని నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ పరిశోధకలు తెలిపారు. అయితే ఇది 2016 మేలో నమోదైన పుడమి సరాసరి ఉష్ణోగ్రతకు సమానమని చెప్పారు.

మే నెలలో ప్రపంచ సగటు ఉష్ణోగ్రత 60.3 డిగ్రీలుగా రికార్డైనట్లు వెల్లడించారు పరిశోధకులు. ఇది 20వ శతాబ్దిలో నమోదైన సరాసరి పుడమి ఉష్ణోగ్రత కంటే 1.7 డిగ్రీలు ఎక్కువని పేర్కొన్నారు. అటు సముద్ర ఉష్ణోగ్రతలు కూడా అధికంగానే ఉన్నట్లు తెలిపారు. భూమి సగటు ఉష్ణోగ్రత తరువాతి స్థానంలో సముద్ర ఉష్ణోగ్రతలు ఉన్నట్లు వివరించారు.

ఆఫ్రికా, ఆసియా, పశ్చిమ ఐరోపా, దక్షిణ అమెరికా దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు పరిశోధకులు తెలిపారు.

ఇదీ చూడండి: తల్లికి కరోనా ఉన్నా బిడ్డకు పాలివ్వొచ్చు: డబ్ల్యూహెచ్​ఓ

ABOUT THE AUTHOR

...view details