NFT Technology: అమెరికాకు చెందిన ఓ యూట్యూబర్ ఓవర్ నైట్ కోటీశ్వరుడయ్యాడు. కేవలం క్షణాల వ్యవధిలోనే రూ. 1.75 కోట్ల సంపాదించాడు. క్రిప్టో వంటి డిజిటల్ కరెన్సీ అయిన నాన్-ఫంగబుల్ టోకెన్‌ల (ఎన్‌ఎఫ్‌టీ) తో సెకన్ల వ్యవధిలో ఈ మొత్తాని సంపాదించి ఓవర్‌నైట్ సెన్సేషన్‌గా మారాడు. ఆయన పేరే జోనాథన్ మా. ఈ వచ్చిన డబ్బులతో సినిమా నిర్మాత కావాలనే కోరిక మరి కొద్ది రోజుల్లోనే తీరనున్నట్లు చెప్తున్నాడు. ఈయన గతంలో ఫేస్బుక్, గూగుల్ లాంటి కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కూడా పని చేశాడు.
కాలిఫోర్నియాకు చెందిన ఈ యువ యూట్యూబర్ 'జోమా టెక్' పేరుతో కంప్యూటర్ ప్రోగ్రామింగ్, క్రిప్టో, టెక్నాలజీకి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తుంటాడు. ఇతని ఛానెల్‌కు 16 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే ఈ నెల ప్రారంభంలో అతను 'వ్యాక్సీడ్ డాగ్గోస్' పేరుతో ఎన్ఎఫ్టీ (నాన్-ఫంజిబుల్ టోకెన్) కలెక్షన్‌ను విడుదల చేశారు. ఇదే ఆయనకు సుమారు రూ. 1.75 కోట్లను తెచ్చి పెట్టింది. అది కూడా కేవలం 42 సెకన్లలోనే ఖర్చులు పోనూ ఆయనకు రూ. 1.40 కోట్లు మిగిలాయని అంచనా వేస్తున్నారు.
నాన్-ఫంజిబుల్ టోకెన్ అంటే?