అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు రసవత్తరంగా మారిన వేళ.. ఇప్పుడు అందరి చూపు 'స్వింగ్' స్టేట్స్పైన పడింది. ఈ రాష్ట్రాలే.. తదుపరి అధ్యక్షుడిని నిర్దేశించనున్నట్టు నిపుణులు చెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో ఇప్పటికే ఫలితాలు వెలువడగా.. మరికొన్నిటిలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మరి ఆయా రాష్ట్రాల్లో గెలిచిందెవరు?
ఆరిజోనా
ఆరిజోనా(11 ఎలక్టోరల్ ఓట్లు) జో బైడెన్‌కు దక్కింది. రిపబ్లికన్లకు పట్టు ఉన్న ఈ రాష్ట్రం ఇప్పుడు డెమొక్రాట్ల చెంతకు చేరింది.
ఫ్లోరిడా..
హోరాహోరీ పోరు సాగిన రాష్ట్రాల్లో ఫ్లోరిడా(29) ఒకటి. చివరకు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడ గెలుపొందారు. 2016లోనూ ట్రంప్ గెలుపులో ఫ్లోరిడా కీలక పాత్ర పోషించింది.
అయోవా...
అయోవా(6)ను మరోమారు ట్రంప్ సొంతం చేసుకున్నారు. 2016 వరకు డెమొక్రాట్లకు కంచుకోట అయిన అయోవాలో ట్రంప్ వరుసగా రెండోసారి విజయం సాధించారు.
నెవాడా..