అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాఖలు చేసిన పలు కేసులను సుప్రీం కోర్టు సోమవారం లాంఛనప్రాయంగా కొట్టివేసింది. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ గెలుచుకున్న ఆరిజోనా, జార్జియా, మిషిగన్, పెన్సిల్వేనియా, మిస్కాన్సిన్ రాష్ట్రాల్లో ట్రంప్, ఆయన మద్దతుదారులు దాఖలు చేసిన దావాలు ఇందులో ఉన్నాయి.
ఎన్నికల్లో అక్రమాలపై ట్రంప్ దావాల కొట్టివేత - సుప్రీం కోర్టు
అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ మొదటి నుంచి ఆరోపిస్తున్న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కోర్టులోనూ చుక్కెదురైంది. ఎన్నికల అవకతవకలపై దాఖలు చేసిన పలు దావాలను సుప్రీం కోర్టు లాంఛనప్రాయంగా కొట్టివేసింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
పెన్సిల్వేనియా ఫలితాల విషయంలో దాఖలైన దావాలను విచరాణకు స్వీకరించడంపై న్యాయమూర్తుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే.. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికన వాటిని కూడా తిరస్కరించారు.
ఇదీ చూడండి:బ్రిక్స్ విషయంలో భారత్‌కు చైనా మద్దతు!