ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను అణిచే శక్తి సూర్యుడికి ఉందంటోంది అమెరికా. వేసవిలో కొవిడ్-19 బలహీనంగా మారుతుందని.. ఈ సమయంలో వైరస్ను అంతం చేయడం సులభమంటోంది.
భారత్కు మంచి ఛాన్స్..
యూఎస్ శాస్త్రీయ-సాంకేతిక సంచాలక కార్యాలయం తాజాగా ఓ పరిశోధన చేపట్టింది. వేసవిలో సూర్యుడి అతినీలలోహిత కిరణాలు, అధిక ఉష్ణోగ్రత, ఆర్ద్రత, వంటి పరిస్థితులు.. కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గిస్తాయని ఈ అధ్యయంలో తేలింది. భారత్కు ఈ ఎండాకాలం వైరస్ను జయించేందుకు దోహదపడుతుందని శ్వేతసౌధంలో, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో ప్రకటించింది ఆ దేశ హోం శాఖ.
"వేసవిలో కరోనా వ్యాప్తి తగ్గుతుంది. ప్రత్యక్ష సూర్యకాంతిలో వైరస్ వేగంగా నశిస్తుంది. 35 డిగ్రీల సెల్సియస్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉంటే... ఉపరితలంపై ఉన్న వైరస్ జీవితకాలం 18 గంటల నుంచి కొన్ని నిమిషాలకు తగ్గిపోతుంది. 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యక్షంగా సూర్యకాంతి తగిలితే కరోనా కొద్ది నిమిషాల్లోనే అంతమవుతుంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈసారి దిల్లీలో గరిష్ఠంగా 36.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావచ్చు. "