'ఉగ్రవాద ప్రోత్సాహ దేశాల జాబితా' నుంచి ఉత్తర ఆఫ్రికా దేశం సూడాన్‌ను త్వరలో తొలగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అమెరికాలోని ఉగ్రవాద బాధితులకు 33.5 కోట్ల డాలర్లను చెల్లించేందుకు సూడాన్ అంగీకరించిన తర్వాత ట్రంప్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
"గొప్ప వార్త! అమెరికాకు చెందిన ఉగ్రవాద బాధితులకు 33.5 కోట్ల డాలర్లను చెల్లించడానికి సూడాన్‌లోని కొత్త ప్రభుత్వం అంగీకరించింది. ఈ డబ్బు అందిన వెంటనే ఉగ్రవాద ప్రోత్సాహక దేశాల జాబితా నుంచి సూడన్‌ను తొలగిస్తాం. ఆలస్యమైనా.. సూడాన్ తీసుకున్న గొప్ప నిర్ణయంతో అమెరికా ప్రజలకు న్యాయం లభించింది."