తెలంగాణ

telangana

ETV Bharat / international

video viral: రంగులు మారుస్తున్న వింత పాము​ - రెయిన్​బో స్నేక్​

అమెరికాలోని ఓ జూలో ఉన్న పాము వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్​ అవుతోంది. క్షణాల్లోనే రంగులు మారుస్తూ చూపరులను ఆకర్షిస్తున్న ఆ పాము గురించి తెలుసుకుందాం.

rainbow snake
రెయిన్​బో పాము

By

Published : Jun 28, 2021, 12:58 PM IST

స్మార్ట్​ఫోన్లు వచ్చిన నాటి నుంచి వైరల్​ వీడియోలు నెట్టింట హల్​చల్​ చేస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటిదే ఓ పాము వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ చక్కర్లు కొడుతుంది. ఇది చూసేందుకు వింతగా ఉండి.. రంగులు మార్చుతూ.. ఇంద్రధనుస్సులా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోను అమెరికాలోని 'రెప్టిల్​ జూ' తన ఇన్​స్టా​ పేజ్​లో షేర్​ చేసింది. 'మై లవ్​' అని ఆ పాముకు పేరు కూడా పెట్టారు. షేర్​ చేసిన వీడియోకు క్యాప్షన్​గా 'మై లవ్​ రంగులు మార్చుతుంది కానీ.. ఎప్పటికి దీనికి ముసలితనం రాదు' అని ఇంగ్లిష్​లో జత చేశారు.

ఈ వీడియోలో ఓ మహిళ ఈ భారీ పామును మెడలో వేసుకుని దాని చర్మాన్ని చూపిస్తుంది. ఈ క్రమంలో పాము మొదట నీలం రంగులో ఉంటుంది. ఆ తర్వాత రంగులు చకచక మార్చేస్తుండడం మనం గమనిస్తాం.

ఇంద్రధనుస్సులా రంగులను కలిగి ఉన్న ఈ పాములును ఫరాన్సియా ఎరిట్రోగ్రామా అని పిలుస్తారు. ఇవి చాలా పెద్దవి. ఇవి అమెరికాలోని ఆగ్నేయ తీరాలకు చెందినవి.

ఇదీ చూడండి:Viral Video: రాడ్డుతో బైకర్​ తల పగలగొట్టిన వ్యక్తి

ABOUT THE AUTHOR

...view details